- డా|| దాశరథి రంగాచార్య చేసిన సాహిత్యసేవను వివరించండి.
Answers
నాకు తెలియదు ద్భ్ధ్ష్షః
Answer:
దాశరథి రంగాచార్యులు సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. వీరు ఆగస్టు 24, 1928 నాడు ఖమ్మం జిల్లా లోని చిట్టి గూడూరు అనే ఊర్లో జన్మించారు.
తెలంగాణా సాయుధ పోరాటం నాటి స్థితిగతులు, ఆ కాలంలోని దారుణమైన బానిస పద్ధతులను దాశరథి రంగాచార్యులు చిల్లర దేవుళ్ళు, మోదుగుపూలు, జనపదం నవలల్లో చిత్రీకరించారు. చిల్లర దేవుళ్లు నవలలో సాయుధపోరాటం ముందు స్థితిగతులు, మోదుగుపూలు నవలలో తెలంగాణ సాయుధ పోరాటకాలం నాటి పరిస్థితులు, అనంతర పరిస్థితులు "జనపదం"లో అక్షరీకరించారు.
వట్టికోట ఆళ్వారుస్వామి ప్రజల మనిషి, గంగు వంటి నవలల ద్వారా నాటి జీవన చిత్రణ చేయాలనే ప్రయత్నం ప్రారంభించారు. ఆ నవలల ప్రణాళిక పూర్తి కాకుండానే ఆళ్వారు స్వామి మరణించారు. సాయుధపోరాట యోధులుగా, సాహిత్యవేత్తలుగా ఆళ్వారుస్వామికీ, రంగాచార్యులకూ సాన్నిహిత్యం ఉండేది. ఆయన జూన్ 8, 2015 నాడు హైదరాబాద్ లో కన్ను మూసారు.