India Languages, asked by saraswathi7, 11 months ago

మాతృభాషా ప్రయోజనాలను గురించి మీ మిత్రునికి లేఖ రాయండి.

Answers

Answered by suggulachandravarshi
47

Answer:

విజయవాడ,

28-07-20.

ప్రియమైన మిత్రుడికి,

నేను బాగానే ఉన్నాను. నీవు బాగానే ఉన్నావ్ అని నేను ఆశిస్తున్నాను. చాలా రోజుల తర్వాత నీకు ఉత్తరం రాస్తున్నాను కదా...!! సరే,ఇంతకీ నేను ఈ ఉత్తరాన్ని నీకు ఎందుకు రాస్తున్నానంటే.. నీకు మాతృభాష ప్రయోజనాలు నీ గురించి తెలపడానికి రాస్తున్నాను...

మాతృభాష ఏదైనా అది తల్లి తో సమానం.  మనం తల్లిని ఎంత గౌరవము ఇస్తామో, మన మాతృభాసః ని కూడా అంతే  గౌరవించాలి.  అది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హింది  కావచ్చు. ఎవరి భాష వారికి అది గొప్పది.  మనం తెలుగు భాష తక్కువ అని  అనుకో కూడదు.  తెలుగు భాష కి చాలా చరిత్ర ఉంది.  తెలుగు భాష సంస్కృతం నుండి ఆవిర్భవించింది.   అందులో ఎందరో కవులు, రచయితలు  గ్రంధ కర్తలు చాలా చాలా రచనలు చేశారు.

తెలుగు భాష గొప్పతనం తెలియాలంటే తెలుగులో సంభాషించాలి.  గొప్పవాళ్లు రాసిన రచనలు పద్యాలు, గద్యాలు, గేయాలు, కథలు, కవితలు, పల్లెగీతాలు, కూనిరాగాలు, ఇంకా హాస్య రచనలు, విప్లవ రచనలు , విప్లవ గీతాలు చదవాలి.  ఎన్నిటిలోనూ వారు చేసే భావ ప్రకటన, కొత్త కొత్త పదాలు, ప్రాసలు, సంగీతాలంకారాలు, జ్ఞానం, చరిత్ర తెలుస్తాయి.

 వాటినిగూర్చి మనం తెలుసుకొని  ఇంకొకరికి ఆవిషయాలు చెప్పాలి.  మన భాష గొప్పతనం ముందర మనం అర్ధం చేసుకొని  తరువాత అది తెలియని వారికి చెప్పాలి.

మన  భాషలో ఎన్నో గొప్ప భకృ గీతాలు, మహాభారతం, రామాయణం ,  భాగవతం, దశావతారాలు ఇలా ఎన్నెన్నో ఉన్నాయి.  మనం ఈకాలంలో ఇవేవీ చదవకుండా పాశ్చాత్య సంస్కృతి పైనే ఎక్కువ మక్కువ చూపడం  న్యాయం కాదు పద్ధతి కాదు.  అది మాతృ ద్రోహం చేయడమే.

భారత దేశం లో  ఎన్నో భాషలు ఉన్నాయి.  ఎవరి భాష వారు నేర్చుకొని అందులో ఉన్న తీపి ని  ఆస్వాదించ గలిగితే,  వారు తప్పకుండ మాతృభాషలకు అభిమానులౌతారు.  ఈ కాలం లో పిల్లలు మాతృ భాషను కించపరచ రాదు.  ఇంగ్లీషు హింది మరి ఇతర భాషలు నేర్చుకోవాలి.  కానీ  తెలుగు భాషని గౌరవించాలి.

నా ఉద్దేశం నీకు అర్థమైందనే నేను భావిస్తున్నాను.

చిరునామా:

సంజన రెడ్డి,

d/o, సుబ్బారావు,

వుడా కాలనీ, రాజీవ్ నగర్,

విజయవాడ 520015,

ఆంధ్ర ప్రదేశ్.

నేను కూడా తెలుగునే..

ఈ సమాధానానం ఉపయోగకరంగానే ఉంటుందని నేను ఆశిస్తున్నాను...

Answered by shruthi6303
7

Answer:

May this answer help you

Attachments:
Similar questions