India Languages, asked by saraswathi7, 11 months ago

-మాతృభాషా ప్రయోజనాలను గురించి
మిత్రునికి లేఖ రాయండి.​

Answers

Answered by whamwham
3

Answer:

అందరికి అర్ధమయ్యే తేలికభాషలో ఉత్తరాలు వ్రాయటం ఓక కళ. ఈ లేఖలను, సాంఘిక లేఖని, వ్యవహార లేఖలని రెండు రకాలుగా విభజించవచ్చు. ఈ లేఖారచనలో రెంటికి ఒకే పద్దతి అనుసరించారాదు .కాబట్టి ఎవరెవరికి ఏయే రీతిలో ఉత్తరాలు వ్రాయాలో తెలుసుకోవాలి లేఖను ప్రారంభించే సందర్బంలో లేఖకు కుడిప్రక్క పై భాగంలో తానున్న ఊరు తేది వ్రాయాలి.

సాంఘిఖలేక

మిత్రులకు , బందువులకు రాసే లేఖలు, పెండ్లీ, పుట్టినరోజు మొదలైన శుభకార్యాలకు, బంధువులకు,స్నేహితులకు పంపే పిలుపు పత్రికలూ మొదలైన వాటిని సాంఘిఖ లేఖలంటారు.

సాంఘిఖ లేఖలోతల్లితండ్రులకు రాసే సందర్భాలో ప్రారంభంలో :

పూజ్యులయిన నాన్న గార్కి

ప్రియమైన నాన్న గార్కి

ప్రియమైన అమ్మ (తల్లి) గార్కి

మిత్రులకు అయితే !

Explanation:

ప్రియ మిత్రుడికి

ప్రాణ స్నేహితునికి శ్రీ ..........కు

పరిచయము లేనివారైతే:

అయ్యా!

అమ్మా!---అని సంభోధించాలి

పూర్వం మనదేశ ఆచారాన్ని బట్టి పెద్దవారికైతే "మహారాజశ్రే" "బ్రహ్మశ్రే" "శ్రీ వెదమూర్తులు" మొదలయిన మాటలు ఉపయోగిస్తారు. అలాగే స్త్రీలకు రాసే సందర్భాల్లో "మహాలక్ష్మి సమానురా" లనీ."శ్రీమతి" భర్త చనిపోయినవారికైతే "గంగాభగీరధీ సమానురాలైన" అని మొదలైన వాటిని ఉపయోగిస్తారు.చిన్నవారైతే "చిరంజీవి'అని పేర్లకు ముందు చేరుస్తారు. తనకంటె పెద్దలైన వారికి నమస్కారాలు: వందనాలు అని చెప్పాలి.తనకంటే ఛిన్నవారికి రాసే సందర్భాల్లో 'గ్రహింపవలయును'. ఇట్లు" శ్రేయోభిలాషి' అని వ్రాయాలి.

mark the brainliest

follow me

Answered by suggulachandravarshi
4

Answer:

విజయవాడ,

28-07-20.

ప్రియమైన మిత్రుడికి,

నేను బాగానే ఉన్నాను. నీవు బాగానే ఉన్నావ్ అని నేను ఆశిస్తున్నాను. చాలా రోజుల తర్వాత నీకు ఉత్తరం రాస్తున్నాను కదా...!! సరే,ఇంతకీ నేను ఈ ఉత్తరాన్ని నీకు ఎందుకు రాస్తున్నానంటే.. నీకు మాతృభాష ప్రయోజనాలు నీ గురించి తెలపడానికి రాస్తున్నాను...

మాతృభాష ఏదైనా అది తల్లి తో సమానం.  మనం తల్లిని ఎంత గౌరవము ఇస్తామో, మన మాతృభాసః ని కూడా అంతే  గౌరవించాలి.  అది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హింది  కావచ్చు. ఎవరి భాష వారికి అది గొప్పది.  మనం తెలుగు భాష తక్కువ అని  అనుకో కూడదు.  తెలుగు భాష కి చాలా చరిత్ర ఉంది.  తెలుగు భాష సంస్కృతం నుండి ఆవిర్భవించింది.   అందులో ఎందరో కవులు, రచయితలు  గ్రంధ కర్తలు చాలా చాలా రచనలు చేశారు.

తెలుగు భాష గొప్పతనం తెలియాలంటే తెలుగులో సంభాషించాలి.  గొప్పవాళ్లు రాసిన రచనలు పద్యాలు, గద్యాలు, గేయాలు, కథలు, కవితలు, పల్లెగీతాలు, కూనిరాగాలు, ఇంకా హాస్య రచనలు, విప్లవ రచనలు , విప్లవ గీతాలు చదవాలి.  ఎన్నిటిలోనూ వారు చేసే భావ ప్రకటన, కొత్త కొత్త పదాలు, ప్రాసలు, సంగీతాలంకారాలు, జ్ఞానం, చరిత్ర తెలుస్తాయి.

 వాటినిగూర్చి మనం తెలుసుకొని  ఇంకొకరికి ఆవిషయాలు చెప్పాలి.  మన భాష గొప్పతనం ముందర మనం అర్ధం చేసుకొని  తరువాత అది తెలియని వారికి చెప్పాలి.

మన  భాషలో ఎన్నో గొప్ప భకృ గీతాలు, మహాభారతం, రామాయణం ,  భాగవతం, దశావతారాలు ఇలా ఎన్నెన్నో ఉన్నాయి.  మనం ఈకాలంలో ఇవేవీ చదవకుండా పాశ్చాత్య సంస్కృతి పైనే ఎక్కువ మక్కువ చూపడం  న్యాయం కాదు పద్ధతి కాదు.  అది మాతృ ద్రోహం చేయడమే.

భారత దేశం లో  ఎన్నో భాషలు ఉన్నాయి.  ఎవరి భాష వారు నేర్చుకొని అందులో ఉన్న తీపి ని  ఆస్వాదించ గలిగితే,  వారు తప్పకుండ మాతృభాషలకు అభిమానులౌతారు.  ఈ కాలం లో పిల్లలు మాతృ భాషను కించపరచ రాదు.  ఇంగ్లీషు హింది మరి ఇతర భాషలు నేర్చుకోవాలి.  కానీ  తెలుగు భాషని గౌరవించాలి.

నా ఉద్దేశం నీకు అర్థమైందనే నేను భావిస్తున్నాను.

చిరునామా:

సంజన రెడ్డి,

d/o, సుబ్బారావు,

వుడా కాలనీ, రాజీవ్ నగర్,

విజయవాడ 520015,

ఆంధ్ర ప్రదేశ్.

నేను కూడా తెలుగునే..

ఈ సమాధానానం ఉపయోగకరంగానే ఉంటుందని నేను ఆశిస్తున్నాను.

Similar questions