యుద్ధాలు ఎందుకు చేస్తారు? యుద్ధాల వలన లాభమా? నష్టమా? ఎందువల్ల?
Answers
Explanation:
సాధారణంగా స్వార్థ బుద్ధి కలిగిన రాజుల కారణంగా యుద్ధాలు జరుగుతాయి. ఇలాంటి వారు రాజ్య విస్తరణ కోసం యుద్ధాలు చేస్తారు. తమ కీర్తి ప్రతిష్టలు చాటుకోవడానికి యుద్ధాలు చేస్తారు. నాయకత్వ బలాన్ని నిరూపించుకోవడానికి యుద్ధాలు చేస్తారు. యుద్ధాల వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. యుద్ధాల వల్ల ధన, మాన ప్రాణాలకు భంగం వాటిల్లుతుంది. ప్రజల శాంతీయుత జీవనానికి భంగం కలుగుతుంది. యుద్ధం వల్ల వికలాంగులు, వితంతువులు మిగులుతారు. యుద్ధం అశాంతిని కలిగిస్తుంది.
Answer:
యుద్ధాలు స్పష్టమైన ప్రకటన ద్వారా కాని, లేక అప్రకటితంగా గాని జరుగవచ్చును. యుద్ధాల కారణాలు తెలుసుకోవాలంటే శాంతి వాతావరణాలు కొనసాగే పరిస్థితులను కూడా అధ్యయనం చేయాలి. యుద్ధాలు మొదలుపెట్టే పక్షం కారణాలు వేరు, తత్ఫలితంగా యుద్ధం చేసే పక్షం కారణం వేరు అని కూడా గ్రహించాలి. ఏదైనా యుద్ధంలో పాల్గొనే లేదా ప్రభావం కలిగి ఉన్న మూడు వర్గాలు - నాయకత్వం, మిలిటరీ, దేశ ప్రజలు. ఈ మూడు వర్గాలకూ యుద్ధంలో పాల్గోటానికి వేరువేరు కారణాలు లేదా అభిప్రాయాలు ఉండవచ్చును.
యుద్ధంలో అయ్యే నష్టం లేదా వ్యయం కంటే దానివలన వచ్చే ప్రయోజనం ఎక్కువని ఒక పక్షం భావించినందువలన యుద్ధం సంభవిస్తుంది. ప్రయోజనాలు చాలా రకాలుగా ఉంటాయి - ఉదా: జాతీయ గౌరవం నిలుపుకోవడం, తమ ప్రదేశపు వనరుల వల్ల ప్రయోజనాలు తమకే లభించేలా చేసుకోవడం, అన్యాయం చేసిన పక్షాన్ని శిక్షించడం (ముఖ్యంగా రెండవ పక్షం బలహీనంగా ఉన్నపుడు) - ఈ విధమైన సిద్ధాంతాల ప్రకారం ఆణుయుద్ధాల వంటి వినాశక యుద్ధాల అవకాశం తక్కువ. ఎందుకంటే ఆందువల్ల లభించే ప్రయోజనాలకంటే విపరీతాలే ఎక్కువ గనుక.
కొన్ని యుద్ధాలు దేశ చరిత్ర పైన, భవిష్యత్తు పైన, ప్రజల జీవనంపైన గాఢమైన ఫలితాలను కలిగిస్తాయి.
సైన్యం పై..
యుద్ధ రంగంలో తమ ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడే సైనికులు తీవ్రమైన శారీరిక, మానసిక అనుభవాలను ఎదుర్కొంటారు. మరణించిన వారి జీవితం అంతటితో సమసిపోయినా వారి కుటుంబాలకు అది చిరకాల బాధాకారణమౌతుంది.
సామాన్య జనానీకంపై..
జన నష్టంతో పాటు ఆస్తి నష్టం, ఆర్థిక వ్యవస్థ గందరగోళం, మానసిక వత్తిడులు సామాన్య జనానీకంపై ప్రగాఢమైన ప్రభావం కలిగి ఉంటాయి. నేరము, శిక్ష, ద్వేషం, జాతి వైరం, తెగింపు వంటి భావాలు సమాజాన్ని చాలాకాలం అంటిపెట్టుకొని ఉంటాయి.
ఆర్ధిక వ్యవస్థపై..
సమాజం ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బ తినే అవకాశం ఉంది. కోలుకోవడానికి సంవత్సరాలు లేదా దశాబ్దాలు పట్టవచ్చును. దేశం వనరులు చాలావరకు ప్రగతినుండి మిలిటరీ అవసరాలకు కేటాయింపబడవచ్చును.
రాజకీయాలపై..
దేశంలో నెలకొన్న సంక్షోభం వల్ల, జనంలో రేకెత్తిన తీవ్ర భావాల వల్ల ప్రజలను రెచ్చ కొట్టే నాయకులు అధికారాన్ని హస్తగతం చేసుకొనే అవకాశం ఎక్కువవుతుంది.
ఈ సమాధానం నీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను...