తెలుగు మీద మక్కువ వున్నవారికి
వారాంతములో మెదడుకు మేత.
***************
ఇది ఒక పద్య ప్రహేళిక సమాధానాలన్నీ వరుసగా 'క' గుణింతములోనే వుంటాయి. ప్రయత్నించండి.
కమ్మగా చెవికి సోకి కంచికేగినవేవి?
పితరుల పిండమే పిట్ట తినును?
వెన్నుడు సారధి యెన్నఁగా యెవరికి?
సింహపు బలమున్న జెట్టి యెవరు?
జలముల నింపుగ జమజేయు పాత్రేది?
బాటలు నాలుగెచ్చోట గలియు?
విష్ణువేపేరున వెలసి ద్వాపరమున ?
ఆదిత్య దేవుని కనుకూల మణియేది?
రథమున కెయ్యది రాణ గూర్చు?
అడవులకే రాణి యంపించె రాముని?
రాయంచ లెట విహార మొనర్చు?
కూయన కూయని కూసెడు పులుగేది?
చంద్రుడు వెదజల్లు చలువ యెద్ది?
పద్యరాజమ్మని పదుగురందురు దేని?
విద్య నేర్చిన బాల విప్పవమ్మ.
"పైని ప్రశ్నల బరికించి వానికెల్ల
పేర్మి గూర్చ జవాబుల నేర్పుగాను
కాంచరో చదువరులార 'క' గుణింతమును
కమ్మనౌ పద్యమ్మున నిమ్ముగాను
పై ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వరుసగా 'క' గుణింతములోనే ఉంటాయి. కనుక్కోండి చూద్దాం.
Answers
Answer:1.కవి, 2.కాకి,4.కీచకుడు, 5.కుండ, 6.కూడలి 7.కృష్ణ 8.కెంపు, 10.కైకేయి 12,.కోయిల
Explanation:
'క' గుణింతములోనే వరుసగా సమాధానాలు :
1. కమ్మగా చెవికి సోకి కంచికేగినవేవి : కథలు
2. పితరుల పిండమే పిట్ట తినును : కాకి
3. వెన్నుడు సారధి యెన్నఁగా యెవరికి : కిరీటి
4. సింహపు బలమున్న జెట్టి యెవరు : కీచకుడు
5. జలముల నింపుగ జమజేయు పాత్రేది : కుండ
6. బాటలు నాలుగెచ్చోట గలియు : కూడలి
7. విష్ణువేపేరున వెలసి ద్వాపరమున : కృష్ణుడు
8. ఆదిత్య దేవుని కనుకూల మణియేది : కెంపు
9. రథమున కెయ్యది రాణ గూర్చు : కేతనము
10. అడవులకే రాణి యంపించె రాముని : కైకేయి
11. రాయంచ లెట విహార మొనర్చు : కొలను
12. కూయన కూయని కూసెడు పులుగేది : కోకిల
13. చంద్రుడు వెదజల్లు చలువ యెద్ది : కౌముది
14. పద్యరాజమ్మని పదుగురందురు దేని : కందం
Learn more :
1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?
brainly.in/question/16066294
2. Essay on telugu language in telugu.
brainly.in/question/788459
3. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.
brainly.in/question/16302876