India Languages, asked by Subhushanmukh, 1 year ago

చీమలు పెట్టిన పుట్టలు
పాములకిరవైన యట్లు పామరుడు దగన్
హేమంబు గూడబెట్టిన
భూమీశుల పాలజేరు భువిలో సుమతీ!

ఈ పద్యం యొక్క అర్థం రాయండి?​

Answers

Answered by vasanthaallangi40
1

తిక్కన గారి శిష్యుడైన బద్దెన భూపాలుడు అనే చోళుల రాజు, ఈ సుమతీ శతకముల రచయిత .

భావం చీమలు నిర్మించిన పుట్టలు, ఎలాగైతే పాముల ఆధీనం లోనికి వస్తుందో, అలానే మూర్ఖుడు కూడబెట్టిన బంగారం కూడా రాజుల దగ్గరకు చేరుతుంది .

వ్యాకరణం

పామరుడు × పండితుడు

= మూర్ఖుడు

హేమంబు = బంగారము

గూడబెట్టిన = కూడబెట్టిన

భూమీశుల = పాలించేవారు = రాజులు

పాలజేరు = దరికి చేరు

సమాచారం మీకు సహాయకరంగా ఉంటుందని భావిస్తున్నాను _/\_

Similar questions