Psychology, asked by perumallesh133, 11 months ago

తన గురించి చులకనగా మాట్లాడడం తగదని కాకి మనుషులతో మాట్లాడింది గురించి సంభాషణ రూపంలో రాయండతన గురించి చులకనగా మాట్లాడడం తగదని కాక మనుషులతో మాట్లాడే గురించి సంభాషణ రూపంలో రాయండి ​

Answers

Answered by yash197911
7

❤️Heya mate, here in brainly.in, most common languages used and known and known by people are :- Hindi, English, etc..

So, to get helped by our team of experts, you need to post your question in English.

#BeBrainly

Answered by ymeghana56
4

కాకి(K) :- కావ్ ! కావ్ !

Manishi (M) ఎంటా కాకిగోల! పొద్దున్నే పని చేసుకోనీకుండా ఒకటే గోల. ఎందుకు అరుస్తున్నావు? అవతలికి పో! మనిషి

కాకి : మిమ్మల్ని పలకరిద్దామని వచ్చాను.

M: అయితే! అంత గట్టిగా అరుస్తావా! కర్ణకఠోరంగా అరుస్తావా! నీ గొంతు ఏం బాగుండదు.

K:-నా గొంతు కన్నా నిన్ను వచ్చిన నా ప్రేమను చూడండి. నన్ను అంటున్నారు కానీ! మీ మనుషులందరివీ త్యాగయ్య గొంతులా! మీపిల్లలమీద ఒక్కసారి అరుస్తే వాళ్ళు గజగజ లాడిపోతారు. 1 మీ ఇంట్లో వాళ్లనడగండి మీ గొంతు ఎంత భయంకరంగా ఉంటుందో!:

M: సరే! ఇందాక ఏమిటా గోల! ఎందుకు మీ కాకులు ఒకటే గోల చేస్తూ అన్ని వచ్చాయి..

కాకి : మాలో ఒక కాకికి కరెంట్ షాక్ కొట్టి కాలు చచ్చుబడి కింద పడిపోయింది. అందుకని అందరం కలిసి మాతోటి కాకికి సంతాపం తెలపటానికి కలసి వచ్చాము,

మనిషి: అయితే అన్నీ రావడమెందుకు? : అదే మా బలం, బలగం కూడా. మీ మనుషులలాగా మేము స్వార్ధపరులం కాదు. మా ఐకమత్యాన్ని | మీరూ నేర్చుకోవాలి. : నువ్వేమిటి ఇందాక గారె ముక్కును తింటున్నావు. ఎక్కడి నుంచి ఎత్తుకొని వచ్చావు??

K:-నేనేమీ ఎత్తుకు రాలేదు మీ పక్కింటి పిల్లవాడు గారి సగం తిని బయట పారేశాడు. దాన్ని నేను తెచ్చుకొని తిన్నాను.

M:- మరి నీ స్వరం మాటేంటి. కర్ణకఠోరంగా ఉంటుంది. కోయిల చూడు ఎంత మధురంగా కూస్తుందో!

K: నేను మీరు పారేసిన ఎంగిలి మెతుకులు ఏరుకొని తిని ఈ పరిసరాలను శుభ్రం చేస్తున్నాను. అదే కోకిల ఎక్కడో చిటారుకొమ్మన కూర్చుని చిగురాకులు తింటుంది. నా లాగ చుట్టాలొస్తున్నారన్న కబురు తెస్తుందా? మీ ఇంట వాలి పలకరిస్తుందా? మీరు మా రంగునో, గొంతువో కాకుండా మా స్వభావమును మాలోని విశిష్టగుణాలను గుర్తించి, ప్రకృతిలోని మిగిలిన పక్షులలాగే మమ్మల్ని కూడ ఆదరించడం నేర్చుకోండి!.

M:- నిజమే! నువ్వు చెప్పినదంతా నిజమే. నువ్వు చెప్పినట్లే నీలోని విశిష్ట గుణాలను మేము కూడా విన్ను కూడా ఆదరిస్తాం.

Similar questions