‘రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?
Answers
'రాజు రివాజులు బూజు పట్టగన్' అనే ఈ పంక్తి దాశరధి కృష్ణమాచార్యులు రచించిన రుద్రవీణ లోనిది.
పంక్తి యొక్క అర్థం :
'రాజు రివాజులు బూజు పట్టగన్' అనగా 'ఉద్రిక్తలు కల్గించిన నవాబుల ఆజ్ఞలను పాటించే కాలం చెల్లిపోయింది' అని అర్థం.
పద్యం :
నాలుగు వైపులన్ జలధి నాల్కలు సాచుచు కూరుచుండె! క
ల్లోలము రేపినారు భువిలో! నలుదిక్కుల గండికొట్టి సం
ద్రాలకు దారినిచ్చిరి! ధరాతలమెల్ల స్వతంత్ర వారి ధా
రాలులితమ్ము కాదొడగె, రాజు రివాజులు బూజు పట్టగన్!
తాత్పర్యం :
తెలంగాణా స్వాతంత్య్ర పోరాటం సముద్రం మాదిరిగా ఉప్పొంగుతున్నది. నాల్గువైపుల నుండి సముద్రానికి గండికొట్టి తెలంగాణ నేలనంతా స్వాతంత్య్రపు నీటితో తడుపుతున్నారు. ఉద్రిక్తలు కల్గించిన నవాబుల ఆజ్ఞలను పాటించే కాలం చెల్లిపోయింది.
Learn more :
1) మిత్రురాలను సంక్రాంతికి తమ ఊరుకి ఆహ్వానిస్తూ లేఖ.
brainly.in/question/14590444
2) సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి .
brainly.in/question/16289469