India Languages, asked by devisriprasad2006, 11 months ago

-'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?​

Answers

Answered by poojan
9

'రాజు రివాజులు బూజు పట్టగన్'  అనే ఈ పంక్తి దాశరధి కృష్ణమాచార్యులు రచించిన రుద్రవీణ లోనిది.  

పంక్తి యొక్క అర్థం :

'రాజు రివాజులు బూజు పట్టగన్' అనగా 'ఉద్రిక్తలు కల్గించిన  నవాబుల ఆజ్ఞలను పాటించే కాలం చెల్లిపోయింది' అని అర్థం.  

పద్యం :

నాలుగు వైపులన్ జలధి నాల్కలు సాచుచు కూరుచుండె! క  

ల్లోలము రేపినారు భువిలో! నలుదిక్కుల గండికొట్టి సం  

ద్రాలకు దారినిచ్చిరి! ధరాతలమెల్ల స్వతంత్ర వారి ధా

రాలులితమ్ము కాదొడగె, రాజు రివాజులు బూజు పట్టగన్!

తాత్పర్యం :

తెలంగాణా స్వాతంత్య్ర పోరాటం సముద్రం మాదిరిగా ఉప్పొంగుతున్నది. నాల్గువైపుల నుండి  సముద్రానికి గండికొట్టి తెలంగాణ నేలనంతా స్వాతంత్య్రపు నీటితో తడుపుతున్నారు. ఉద్రిక్తలు కల్గించిన  నవాబుల ఆజ్ఞలను పాటించే కాలం చెల్లిపోయింది.

 

మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కానిచో కామెంట్లో తెలియచేయండి.  

కృతఙ్ఞతలు.

Similar questions