సీతాదేవికి రామునిచేతిలోరావణుడు మరణిస్తాడని తనస్వప్నవృత్తాంతం చెప్పినది ఎవరు?
Answers
Answered by
6
సీతాదేవికి రామునిచేతిలోరావణుడు మరణిస్తాడని తన స్వప్నవృత్తాంతం చెప్పినది త్రిజట.
Explanation :
- త్రిజట స్వప్నవృత్తాంతం సుందరకాండలో ఉంది.
- రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంకలో దాచి ఆమెకు కాపలాగా కొందరు రాక్షస స్త్రీలను ఉంచుతాడు. అలా ఉంచిన రాక్షస స్త్రీలలో త్రిజట ఒకటి.
- త్రిజట ఒక వృద్ధురాలు.
- చాలా మంది త్రిజటను విభీషణుని కూతురు అనుకుంటారు. కానీ త్రిజట వృద్ధురాలు కాబట్టి విభీషణుని కూతురి అయి ఉండదు. విభీషణుని కూతురు 'నల'. దీనికి సాక్ష్యం వాల్మీకి రచనలో "త్రిజటా వృద్ధా ప్రబుద్ధా వాక్యమబ్రవీత్" అని ఉన్న పంక్తి .
Learn more :
1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?
brainly.in/question/16066294
2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.
brainly.in/question/16302876
3. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి.
brainly.in/question/16289469
4. పదాలకు సరళమైన తెలుగులో అర్ధాలు
brainly.in/question/16442994
Similar questions