మకుటం అంటే అర్థం ఏమి?
Answers
Answered by
73
Answer:
మకుటం అంటే కిరీటం అని అర్థం. రాజుకు కిరీటం ఎంత ప్రధానమైనదో శతకానికి మకుటం అంత ప్రధానమైనది.
మకుటం అనగా...ప్రతిపద్యానికి చివర వాక్యం లేదా పదాన్ని మకుటం అంటారు.
ఈ సమాధానం నీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను.....
Answered by
33
మకుటం అనగా కిరీటం అని అర్ధం.
Explanation :
- మకుటం అంటే ముఖ్యమైనది అని కూడా అర్ధం వస్తుంది.
- ఒక రాజుకి కిరీటం ఎంత ముఖ్యమో, ఒక శతకానికి మకుటం కూడా అంతే ముఖ్యం.
- ఈ మకుటం ద్వారా ఆ పద్యాలకు ఒక గుర్తింపులా పనిచేస్తుంది. దీని బట్టి ఆ పద్యమును ఎవరు రాసారో గ్రహించవచ్చు.
- ఉదాహరణకు, వేమన పద్యాలకు మకుటం 'విశ్వదాభిరామ వినుర వేమ !'. అలానే బద్దెన రాసిన పద్యాలకు మకుటం 'సుమతీ!'
Learn more :
1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?
brainly.in/question/16066294
2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు
brainly.in/question/16302876
Similar questions