ఈ క్రింది సామెతల
ు విశ్లేషించండి.
అ) అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు
ఆ) పులిని చూచి నక్కవాత బెట్టుకున్నట్ల
ఇ) మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు.
ఈ కింది పొడుపు కథలకు సమాదాన
Answers
Answer:
హలో! నేను కూడా తెలుగునే! ఇక్కడ ఒక తెలుగు వారిని కలవడం సంతోషకరంగా ఉంది.
ఇక నీ ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే,
సమాధానం:-
అ) అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టు.
ఎవ్వరైనా సరే చెయ్యి కడుక్కునే పనిలేకుండా, పండు ను శుభ్రంగా తుడిచే పని లేకుండా, తక్కువ శ్రమతో, సామాన్యుడు కూడా కొన్ని తినగలిగిన పండు, అరటిపండు. అది ఒలిచి మరి ఇస్తే తినడం ఇంకా తేలిక కదా! అదే విధంగా ఏదైనా ఒక పని విషయంలో సంపూర్ణంగా చక్కగా అర్థమయ్యేట్లు వివరించడం, అన్నీ అమర్చి పెట్టడం, అని ఈ సామెత తో సూచిస్తారు.
ఆ) పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు.
ఒక నక్క, "పులి చర్మం రంగు నా చర్మం రంగు ఒకటిగానే ఉంటాయి. పులిని చూసి జంతువులు పడడానికి కారణం దాని ఒంటి మీద ఉన్న నల్లని రంగు చారలు" అని భావించి, తనని చూసి కూడా అన్ని జంతువులు భయపడాలి అని అనుకొని తన శరీరంపై చారలు లాగా వాతలు పెట్టుకొని కష్టాల పాలైంది.
గొప్ప వారిని గుడ్డిగా తమ బలాబలాలు తెలియక వారిని అనుకరించే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.
ఇ) మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు.
తాటి చెట్టు పై నుండి తాటి కాయ కింద పడితే పెద్ద దెబ్బ తగులుతుంది. ఒక నక్క ఆహారం లేకనో, వ్యాధితో బాధపడుతూ, మూలుగుతూ ఎండ బాగా ఉన్నందున ఒక తాటి చెట్టు కింద నిలబడింది. దానిమీద దాని మీద పై నుండి తాటికాయ పడి తల పగిలి ఎంత పని అయింది. ఆ నక్క కళ్లు తేలేసింది.
అది బాధే కదా! అలా కష్టాల్లో ఉన్న వారిపై మరొక కష్టం వచ్చి పడింది అని చెప్పే సందర్భాలలో ఈ సామెతను ఉపయోగిస్తారు.
నా సమాధానం నీకు ఉపయోగకరంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను..❣️❣️
Answer:
నువు తపు సమాదానం ESTUNNAVU