అ) అమరావతిలో అద్భుత శిల్పసంపదను సృష్టించిన శిల్పులను అభినందిస్తూ ఒక లేఖ రాయండి
Answers
Answer:
ప్రియమైన మిత్రునికి
నేను క్షేమం. నీవు క్షేమమని తలుస్తాను. నీవు 10వ తరగతి పరీక్షలకు ఏ విధంగా తయారవుతున్నావు. నేను బాగా చదువుతున్నాను. మొన్న మా పాఠశాల విద్యార్థులను అమరావతికి తీసుకువెళ్ళారు.
అక్కడ మ్యూజియంలో, బౌద్ధారామాలలో ఉన్న శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి. అమరావతి శిల్పాలు శరీర ధర్మ శాస్త్రాన్ననుసరించి తయారు చేసినవి. ఆ శిల్పులను మనం తప్పకుండా అభినందించాలి. ఆ శిల్పాలు వారి కీర్తిని శాశ్వతం చేస్తూ మన దేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు విస్తరించేలా ఉన్నాయి. శిల్పి తన కష్టంతో రాయిని దేవతామూర్తులుగా అందమైన స్త్రీలుగా, ముఖంలో భావాలు కనిపించేలా తయారుచేసి తన కీర్తిని మన నూతన రాజధాని కీర్తిని దశ దిశలా చాటుతున్నాడు. కనుక శిల్పులను వారిగొప్పతనాన్ని మనం ముందు తరాలవారికి కూడా తెలియచేయాలి.
మీ తల్లిదండ్రులకు నమస్కారములు. ఒక సారి నీవు కూడా అమరావతిని సందర్శించి నీ అభిప్రాయాన్ని
తెలుపుతూ తిరిగి ఉత్తరం వ్రాయగలవు.
నీ ప్రియమైన స్నేహితుడు,
Explanation:
like and givee rating for my answer