- స్వచ్ఛంద
సంస్థలు
ఏం చేయాలి?
Answers
Answer:
స్వచ్ఛంద సంస్థలు సొసైటీల చట్టం కింద రిజిష్టర్ అవుతాయి. వీటిని ఆదాయరహిత సంస్థలు (నాన్ ప్రాఫిట్ ఇనిస్టిట్యూషన్స్) గా పరిగణిస్తారు. ఈ సంస్థలకు ప్రత్యేక చట్టం ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించరాదు. సంస్థ కార్యకలాపాలు తరచుగా కొనసాగాలి. నెలకు కనీసం ఒకసారి అయినా సమావేశం ఏర్పాటు చేసుకుని సమీక్షించుకోవాలి. సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనాలి. ప్రతి సంస్థకు అధ్యక్షుడు, కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, కోశాధికారి, సభ్యులు ఉండాలి. విధిగా బ్యాంకు ఖాతా తెరిచి నగదు డిపాజిట్ చేసుకోవాలి. క్రమం తప్పకుండా సమావేశాల మినిట్స్ రాసుకోవాలి. విపత్తులు జరిగినప్పుడు సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఈ విధంగా యాక్టు రూపొందించుకుని ఎన్‌జీవోలుగా రిజ్రిస్టేషన్ చేసుకుంటాయి. పుట్టగొడుగుల్లా ప్రభుత్వ రికార్డుల్లో వెలుస్తున్న ఈ సంస్థల కార్యకలాపాలపై ఆరా తీయాలని కేంద్రం నిర్ణయించింది. ఆ మేరకు సర్వే చేస్తే అనేక స్వచ్ఛంధ సంస్థల చిరునామాలు కనిపించడం లేదు. దీంతో ఇవన్ని పేపర్ మీద కొనసాగుతున్న సంస్థలుగా తేల్చారు. భోగస్ స్వచ్ఛంధ సంస్థలు కొనసాగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. వీటి మూలంగా ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా నిజంగా సేవ చేస్తున్న సంస్థలకు కూడా చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఏర్పడింది.