India Languages, asked by malliswaripedapalli, 10 months ago

భారత దేశం గొప్పతనం గురించి
ప్పతనం గురించి వివరించండి?​

Answers

Answered by Natsukαshii
8

ముఖ్య వ్యాసము: భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు

భారత దేశానికి మొత్తం నాలుగు పేర్లు ఉన్నట్లు చెప్పుకోవచ్చు. వీటిలో మొదటిది జంబూ ద్వీపం. ఇది వేదాలలో భారతదేశానికి ఇవ్వబడిన పేరు, ఇప్పటికీ హిందూ మత ప్రార్థనలలో ఈ పేరు ఉపయోగిస్తారు (ఉదా: జంబూ ద్వీపే, మేరో దక్షిణభాగే, శ్రీశైల ఉత్తర భాగే, కృష్ణా గోదావారీ మధ్య స్థానే...). జంబూ అంటే "నేరేడు" పండు లేదా "గిన్నె కాయ", ఈ దేశంలో ఎక్కువగా నేరేడు పండ్లు ఉంటాయి కనుక దీనికి ఈ పేరు వచ్చింది.ఆ తరువాత వచ్చిన పేరు "భారతదేశం" లేదా "భరతవర్షం", ఈ పేరు నాటి రాజు పేరు మీదగా వచ్చినది, ఈ రాజు పేరు "భరతుడు". ఇతను విశ్వామిత్ర, మేనకల కుమార్తె అయిన శకుంతల యొక్క కుమారుడు.

తరువాతి పేరు హిందూదేశం, ఇది సింధుానది పేరు మీదగా వచ్చినది, పూర్వపు పర్షియనులు, గ్రీకులు సింధుానదికి ఆవల ఉన్న దేశం కనుక ఈ పేరుతో పిలిచారు.

తరువాత హిందూదేశం యొక్క రూపాంతరం ఐన ఇండియా అనే పేరు, బ్రిటీషు వారి వలన ప్రముఖ ప్రాముఖ్యతను పొందినది, ప్రస్తుతము భారతదేశానికి రెండు ప్రభుత్వ గుర్తింపు పొందిన పేర్లు ఉన్నాయి. అవి ఇండియా, భారతదేశం. ఇంకా హిందూస్తాన్ అనునది కూడా హిందూదేశం యొక్క రూపాంతరమే.

చరిత్ర

అశోకుడిచే క్రీ.పూ.3 వ శతాబ్దంలో మధ్య ప్రదేశ్ లోని సాంచీలో నిర్మించబడిన స్థూపం.

ముఖ్య వ్యాసము: భారతదేశ చరిత్ర

మధ్య ప్రదేశ్‌ లోని భింబెట్కా వద్ద లభ్యమైన రాతియుగపు శిలాగృహాలు, కుడ్యచిత్రాలు భారతదేశంలో మానవుని అతి ప్రాచీన ఉనికికి ఆధారాలు. మొట్టమొదటి శాశ్వత నివాసాలు 9,000 సంవత్సారాల కిందట ఏర్పడ్డాయి. క్రి.పూ. 7000 సమయంలో, మొట్టమొదటి నియోలిథిక్ స్థావరాలు పశ్చిమ పాకిస్తాన్ లో మెహర్గర్ , ఇతర ఉపఖండపు ప్రాంతాల్లో కనిపించింది. ఈ విదంగా సింధుాలోయ నాగరికత అభివృద్ధి, దక్షిణ ఆసియాలో మొదటి పట్టణ సంస్కృతి అభివృద్ధి చెందాయి. ఇదే క్రీ.పూ.26 వ శతాబ్దం , క్రీ.పూ.20 వ శతాబ్దం మధ్య కాలంలో వర్ధిల్లిన సింధులోయ నాగరికత. క్రీ.పూ.5 వ శతాబ్దం నుండి, ఎన్నో స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయిxe. ఉత్తర భారతంలో, మౌర్య సామ్రాజ్యం, భారతీయ సాంస్కృతిక వారసత్వానికి విలువైన సేవ చేసింది. అశోకుడు ఈ వంశంలోని ప్రముఖ రాజు. తరువాతి వచ్చిన గుప్తులకాలం స్వర్ణ యుగం గా వర్ణించబడింది. దక్షిణాన, వివిధ కాలాల్లో చాళుక్యులు, చేర, చోళులు, పల్లవులు, పాండ్యులు మొదలగువారు పాలించారు. విజ్ఞాన శాస్త్రము, కళలు, సారస్వతం, భారతీయ గణితం, భారతీయ ఖగోళ శాస్త్రం, సాంకేతిక శాస్త్రం, భారతీయ మతములు, భారతీయ తత్వ శాస్త్రం మొదలైనవి ఈ కాలంలో పరిఢవిల్లాయి. రెండవ సహస్రాబ్దిలో తురుష్కుల దండయాత్రలతో, భారతదేశంలో ఎక్కువ భాగాన్ని ఢిల్లీ సుల్తానులు, తరువాత మొగలులు పాలించారు. అయినా, ముఖ్యంగా దక్షిణాన స్థానిక సామ్రాజ్యాలు అధికారాన్ని నిలబెట్టుకున్నాయి.

Similar questions