ఈ మద్య కాలంలో చోటు చేసుకున్న ఏదైనా ఒక ప్రధాన సామాజిక అంశాన్ని లేదా సంఘటనలను ఆధారంగా తీసుకుని సంపడికియ వ్యాసం వ్రాయండి
Answers
Answer:
“ కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది” అని అంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. తెలంగాణలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు రానున్న రోజుల్లో కేసీఆర్‌కు జరగబోయే రాజకీయ నష్టాన్ని సూచిస్తున్నాయి. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు పావులు కదపడం మొదలెట్టారు. ఈ క్రమంలోనే గవర్నర్ నరసింహన్‌ను రంగంలోకి దించినట్లు జరుగుతున్న పరిణామాలు సూచిస్తున్నాయి. తాజాగా చోటు చేసుకున్న రెండు సంఘటనలు ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నారు. అయినా, విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా విద్యాశాఖ అధికారులతో పరిస్థితిని గవర్నర్ సమీక్షించారు. సాధారణంగా ఇలాంటి సమీక్షలను ముఖ్యమంత్రి లేదా విద్యాశాఖ మంత్రి నిర్వహిస్తారు. ఇందుకు భిన్నంగా గవర్నర్ నిర్వహించారు. ఆ సందర్భంగా, ఇంటర్ బోర్డులో చోటు చేసుకున్న అవకతవకలపై గవర్నర్ నిలదీశారు. విద్యార్థుల ఆత్మహత్యల అంశం మరుగున పడిపోయిన తర్వాత.. ముఖ్యంగా హైకోర్టు కూడా ఈ అంశంపై విచారణను ముగించిన తర్వాత విద్యార్థుల ఆత్మహత్యలపై గవర్నర్ వ్యాఖ్యానించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అంతటితో ఆగని గవర్నర్ నరసింహన్.. రెండు రోజుల క్రితం పోడు భూముల వివాదంపై అటవీ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో మాట్లాడారు. ‘అసలు రాష్ట్రంలో ఏమి జరుగుతోంది’ అని ఆ సందర్భంగా గవర్నర్ చేసిన వ్యాఖ్య రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ సఖ్యతతో ముందుకు సాగారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన ప్రతిపక్షాలను.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని గవర్నర్ మందలించడాన్ని కూడా మనం చూశాం.
కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద కూడా ముఖ్యమంత్రికి అనుకూలంగా గవర్నర్ వ్యవహరించారని విన్నాం. కేసీఆర్ కూడా తరచుగా నరసింహన్‌ను కలిసి గంటలకొద్దీ సమాలోచనలు జరిపేవారు. అలాంటిది, గవర్నర్ వైఖరిలో హఠాత్తుగా ఇప్పుడు ఇంత మార్పు ఏమిటి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, కేంద్రంలోని బీజేపీ పెద్దలకు మధ్య సంబంధాలు చెడిపోవడమేనని చెప్పవచ్చు. ఎన్నికల ముందు వరకు ఉభయ పక్షాల మధ్య సంబంధాలు సజావుగానే ఉండేవి. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ వ్యవహరించిన తీరుతో బీజేపీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి కుమార స్వామికి, తమిళనాడులో ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్‌కు, ఉత్తరప్రదేశ్‌లో మాయావతికి, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీకి కేసీఆర్ ఆర్థిక సహాయం చేశారని బీజేపీ నాయకత్వం వద్ద కచ్చితమైన సమాచారం ఉందట! ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ప్రాంతీయ పార్టీల నాయకుల మద్దతుతో కేంద్రంలో చక్రం తిప్పాలన్న ఆలోచనతోనే కేసీఆర్ వారికి ఆర్థిక సహాయం చేశారని బీజేపీ పెద్దలు అంచనాకు వచ్చారు. దీంతో, ముందుగా కేసీఆర్ పని పట్టాలని ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నిర్ణయించుకున్నారని సమాచారం. ‘తాజా ఎన్నికల్లో లభించిన విజయంతో నేను సంతృప్తి చెందడం లేదు. దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు బీజేపీ ఏలుబడిలోకి వచ్చినప్పుడే నేను సంతృప్తి చెందుతాను’ అని ఇటీవల తనను కలిసిన తెలంగాణకు చెందిన పార్టీ నాయకుల వద్ద అమిత్ షా వ్యాఖ్యానించారు.
' ఏ మాత్రం సైద్ధాంతిక పునాదులు లేని పశ్చిమ బెంగాల్‌లోనే అధికారంలోకి వస్తున్నాం. తెలంగాణలో ఎందుకు రాలేం? 2022లో జరగనున్న జమిలి ఎన్నికలలోపు తెలంగాణలో పార్టీ బలపడి.. అధికారంలోకి వచ్చి తీరాలి’ అని రాష్ట్ర నాయకులకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ నరసింహన్‌ను రంగంలోకి దించినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పూర్తి అనుకూలంగా ఉంటూ వచ్చిన నరసింహన్ ఇకపై ఎలా వ్యవహరించబోతున్నారో దీన్నిబట్టి ఊహించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు నరసింహన్ ఆయనకు వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు నివేదికలు పంపేవారు. ప్రధాని నరేంద్ర మోదీకి, చంద్రబాబుకు మధ్య శత్రుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ప్రోత్సహించడాన్ని మనం గమనించాం. బీజేపీకి, వైసీపీకి మధ్య గవర్నర్ అనుసంధానకర్తగా వ్యవహరించారని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది.
మొత్తంమీద స్వయంకృతాపరాధంతో చంద్రబాబు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డిపై ఒక కన్నేసి ఉంచుతూనే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పని పట్టాలన్న నిర్ణయానికి వచ్చిన బీజేపీ అగ్ర నాయకత్వం అందుకోసం ఎవరెవరిని ఎప్పుడు ఎలా మోహరించాలో అలా మోహరిస్తోంది. ఈ క్రమంలోనే ‘రాష్ట్రంలో ఏమి జరుగుతోంది?’ వంటి వ్యాఖ్యలు నరసింహన్ నోటి నుంచి వెలువడుతున్నాయి.
Explanation:
þLÈÄ§È MÄRK MÈ Ä§ ßRÄÌñLÌȧ† ✌✌✌