India Languages, asked by erajireddy6, 8 months ago

ధర్మం మూర్తీభవించిన శ్రీరాముణ్ణి తీర్చిదిద్దింది తల్లి కౌసల్యే, లవకుశులు వీరులుగా శూరులుగా, పరాక్రమశీలురుగా తయారైంది తల్లి సీతమ్మ శిక్షణలో. కాలినడకన ఆసేతు హిమాచలం పర్యటించి, అద్వైత సిద్ధాంతాన్ని బోధించి, దేశ సమైక్యతను సమగ్రతను కాపాడిన ఆదిశంకరులు కూడ తల్లి ఆర్యాంబ ఒడిలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. భారత జాతికి గర్వకారణమైన వీరుడుగా, శూరుడుగా, పేరు ప్రఖ్యాతుల నందుకొని వీర శివాజీ తనతల్లి జిజియాబాయి చేతులలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. ఒక సామాన్య బాలునిలో నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, దేశభక్తి భావాలను నాటి పెంచి, పోషించి గాంధీని మహాత్మునిగా రూపొందించగలిగింది. ఆయన మాతృమూర్తి పుతిలీబాయి.
ప్రపంచ చరిత్రను నిశితంగా పరిశీలిస్తే ఒక వాస్తవం తేటతెల్లమౌతుంది. జాతి గర్వించదగిన వీరులను, శూరులను, మహనీయులను, మహాపురుషులను, ప్రవక్తలను, సంఘసంస్కర్తలు, జ్ఞానులను, యోగులను రూపుదిద్దగల్గిన శిల్పులు మాతృమూర్తులేనని స్పష్టమవుతున్నది.

అ. సీతమ్మ లవకుశులను ఎట్లా తీర్చిదిద్దింది?

ఆ. ఆదిశంకరుల తల్లి పేరేమిటి?

ఇ. శివాజీ జిజియాబాయి ఎట్లా పెంచింది?

ఈ. గాంధీ మహాత్ముడు రూపుదిద్దు కోవడానికి కారణం ఎవరు?

ఉ. జాతి గర్వించదగిన మహనీయులను రూపుదిద్దిన మహాశిల్పులు ఎవరు?​

Answers

Answered by suggulachandravarshi
3

Answer:

అ. సీతమ్మ లవకుశల వీరులుగా, శూరూలుగా తీర్చిదిద్దింది.

ఆ. ఆదిశంకరుల తల్లి పేరు, ఆర్యాంబ.

. శివాజీని జిజియాబాయి వీరుడిగా పెంచింది.

ఈ. గాంధీ మహాత్ముడు గా రూపుదిద్దుకోవడానికి తన తల్లే కారణం.

ఉ. జాతి గర్వించదగిన మహనీయులు రూపుదిద్దిన మహాశిల్పి మన మాతృమూర్తులు.

నా సమాధానం నీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను.

Similar questions