కింది పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంతవాక్యాలు రాయండి.
అ. పుణ్యకాలం
ఈ. నిర్విరామం
ఆ. మనసు వికలం
ఉ. ధర్మబుద్ధి
ఇ. ప్రాయశ్చిత్తం
ఊ. ఒడికట్టడం
Answers
పదాలకు అర్థాలు, సొంతవాక్యాలు
1) పుణ్యకాలం : నిర్ణీతకాలము; పవిత్ర కాలము.
సొంతవాక్యం : నువ్వు ఈ పని పూర్తిచేసేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోయేలా ఉన్నది.
2) నిర్విరామం : ఆపకుండా; ఎడతెగనిది.
సొంతవాక్యం : నిర్విరామంగా అనుకున్నదానిని సాధించడానికి కృషి చేస్తే తప్పకుండా విజయం పొందుతావు.
3) మనసు వికలం : అవధుల్లేని బాధ.
సొంతవాక్యం : పుత్రుల మరణాలను చూస్తూ నిస్సహాయంతో ఉండిపోతున్నందుకు గాంధారి మనస్సు వికలమైపోయింది.
4) ధర్మబుద్ధి : సత్యాన్ని ధర్మాన్ని ఆచరించుట.
సొంతవాక్యం : పాండవుల యొక్క ధర్మబుద్ధే వారిని చివరికి విజేతలుగా నిలిపింది.
5) ప్రాయశ్చిత్తం : పాప క్షయం కోసం చేసే తపస్సు, కర్మ.
సొంతవాక్యం : పాపాచరణకు ప్రాయశ్చిత్తం సరియైన ఔషధం.
6) ఒడికట్టడం : యత్నించు
సొంతవాక్యం : సేనాధిపతి పాపానికి ఒడికట్టాడు కాబట్టి బాహుబలి అతనిని సంహరించాడు.
Learn more :
1. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.
brainly.in/question/16302876
2. రామాయణంలోని పాత్రలు 1) .... ..... కి (3) 2) .... ..... దు డు ( 4)...
brainly.in/question/17212644
3. ఎటునుండి చదివినా ఒకేరకంగా వుండే పదాలను రాస్తారా. ఆధారాలనుబట్టి పదాలు వ్రాయాలి. అన్నీ మూడు అక్షరాల పదాలే!1.కాబట్టి2.కంటివ్యాధి...
https://brainly.in/question/17782318