'సత్పురుషుల స్నేహం అవసరం'. ఎందుకు?
Answers
Answer:
ఎందుకంటే మీకు నేను ఒక ఉదాహరణ ఇస్తాను
Explanation:
నీరము తప్త లోహమున నిల్చి యనామకమై నశించు, ఆ
నీరమె ముత్యమట్లు నళినీదళ సంస్థితమై దనర్చు ఆ
నీరమె శుక్తిలో బడి మణిత్వము గాంచు సమంచిత ప్రభన్
పౌరుష వృత్తులిట్లధము, మధ్యము, నుత్తము గొలుచు వారికిన్
అంటే ఏ వృత్తిని ఎంచుకోవడానికైనా లోకంలో మూడు విధానాలుంటాయి. ఒక నీటి బొట్టు దోసలు వేసే పెనం మీద పడితే ‘సుయ్’ మని ఆవిరైపోయింది. మనం కూడా ఫొటోలు చూసి పాఠశాలలో చేర్పిస్తే చదువు కూడా అంతే అవుతుంది. ఇంకొన్ని పాఠశాలలు కొత్తలో బాగుంటాయి. రెండు, మూడేళ్లు బాగుంటాయి. తరువాత మామూలైపోతుంది. అలాంటి పాఠశాలల్లో చేరిస్తే కొంతకాలం బాగుంటాయి. అంటే నీటి బొట్టు తామరాకు మీద పడ్డట్టుగా కొంతకాలం బాగుంటుంది. మరి ఏ పాఠశాలలో చేరాలి? అదే నీటిబొట్టు ముత్యపు చిప్పలో పడితే ముత్యంగా మారిపోతుంది. నీటిచుక్క కోసం ముత్యపు చిప్ప తెరుచుకుని ఉంటుంది. నీటి చుక్క పడగానే ఆ జీవి చనిపోతుంది. రసాయనిక చర్య జరిగి ముత్యం తయారవుతుంది. మనం కూడా అలా స్వచ్ఛమైన ముత్యం మాదిరిగా తయారుచేసే పాఠశాలను ఎంచుకోవాలి.
మీకు ఈ ఉదాహరణ నచ్చినట్లైతే లైక్ కొట్టండి