India Languages, asked by rahulmukan100, 9 months ago

తెలుగు ఉపద్యాయురాలుని గొప్పతనం
రా
గురించి తెలియజేస్తు

అభినందన పత్రం
రాయండి ,​

Answers

Answered by Anonymous
7

Answer:

Explanation:

   ఇన్ని జీవితాలను ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు అని అడిగితే ప్రాథమిక పాఠశాల పల్లెటూరులో అక్షరాలను పరిచయం చేసిన ఉపాధ్యాయుని పేరే చెబుతారు. ఉపాధ్యాయుని అంకిత స్వభావంతో పిల్లలపై ముద్రవేస్తాడు. అందుకే ఆనాటి ఉపాధ్యాయులు అరుదుగా కనిపిస్తారని అంటుంటారు. ఈనాడు ఏ దేశమైనా తన విద్యావిధానాన్ని రూపొందించుకోవటంలో ఉపాధ్యాయుడే ప్రధానమైన వ్యక్తి అని అన్ని దేశాలు కూడా గుర్తించాయి. ఒక దేశ స్వభావం ఆ దేశ ప్రజల శీలానికి అద్దం పడుతుంది. పౌరుని లక్షణాలు, స్వభావాలకు ఉపాధ్యాయుని అంకిత స్వభావం అద్దం పడుతుంది.

అణగారిన వర్గాలకు విద్యాలయాల్లో ఎలాంటి ప్రవేశం కల్పించాలి? వారిని ఏ విధంగా ఆదరించాలి? దానితో సహా వారిలో విజయాలు సాధించేందుకు విశ్వాసం ఎలా కల్పించాలి? వీటిపైన చర్చ తీవ్రంగా జరుగుతున్నది. పాలసీల రూపకల్పన కన్నా వాటిని అమలు చేసే యోగ్యులైన ఉపాధ్యాయవర్గాన్ని ఎలా ఆకర్షించాలి. ఎలా నిలబెట్టుకోవాలి. వారిలో నైపుణ్యం ఎలా కలిగించాలి. కాబట్టే 21వ శతాబ్దంలో ఉపాధ్యాయ పరిపక్వతే విద్యా ప్రమాణాలకు గీటురాయి అయ్యింది. ఉపాధ్యాయుని పాత్ర ప్రతి యుగంలో మారుతూనే వచ్చింది. ఒకనాడు తనకు తెలిసిన విషయాన్ని మౌఖికంగా చెప్పటమే అతని బాధ్యత. విషయ పరిజ్ఞానంలో తేడా రావటం వలన పాలకవర్గం ఆ బాధ్యతను తీసుకున్నది. జ్ఞాన పరిజ్ఞానం, నైపుణ్యం ఈ రెండు విషయాలు పిల్లలకు నేర్పించవచ్చును. వారి వారి స్థాయిని బట్టి బోధించాలి. వీటికన్నా ఎక్కువగా ఉపాధ్యాయునిలో అంతర్లీనమైన లక్షణాలను ప్రధానంగా చూడవలసి ఉంటుంది. ఉపాధ్యాయుడు ఉత్సాహవంతుడై ఉండాలి. ఉపాధ్యాయుడు తన బాధలను తరగతి గదిలో వ్యక్తంచేస్తే పిల్లల్లో ఉత్సాహం కలిగించలేడు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ వీరభద్రుడు ఇంగ్లీషు హామ్లెట్‌ నవలను నవ్వుకుంటూ ఉత్సాహపరుస్తూ చెప్పేవాడు. అదే వీరభద్రుడు తరగతి గది బైటకు వస్తే వంగి నడిచేవాడు. అంతేకాదు, నవ్వించే వాడు. ఏడ్పించేవాడు. అధ్యాపకుడు చేసే ఈ పని సిలబస్‌లో ఉండదు. అది ఉపాధ్యాయుడు స్వతహాగా ఈ పిల్లల కోసం తన కదలికలను, హావభావాలను సమయాన్ని బట్టి మెలితిప్పుతూ బోధన చేస్తూ ఉంటాడు.

విద్యార్థులను ప్రేమించాలి, ఆదరించాలి. పిల్లల్లో చురుకుదనం కలిగించాలి. తరగతి గదికి వస్తే పిల్ల వాళ్లలో పిల్లవాడిగా, యువకుల్లో యువకుడిగా, పసిపిల్లల్లో పసితనంగా ఎదురుగావున్న పిల్లల వయసునుబట్టి తన స్థాయిని హెచ్చుతగ్గులుగా మార్చుతూ బోధనలు చేయాలి. ఈ విధంగా పిల్లల్లో కాల్పనిక శక్తిని తన మాటలతో పెంచుతాడు. పిల్లలపై కోపాన్ని ప్రదర్శించకుండా నవ్వుకుంటూ వారిలో కొత్తభావాలను ఆవిష్కరిస్తాడు. అది నేర్పితే వచ్చేది కాదు. ప్రతి వ్యక్తికి కూడా సబ్జెక్టు వస్తుంది. ప్రతి వారికి నైపుణ్యాలు తెలుసు. తనలో వున్న విలక్షణాలతో జ్ఞానాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి తినిపిస్తుంటే ఉపాధ్యాయుని సుందరమైన ముఖం ఆ పిల్లలపై ముద్రవేయదా? ఈ లక్షణాలు ఏ శిక్షణా తరగతుల వల్ల రావు.

ఉపాధ్యాయుడు చదువు చెబుతున్నప్పుడే తనలో వుండే కొన్ని లక్షణాలను కొందరి పిల్లల్లో చూస్తాడు. ఫిజిక్స్‌ డిపార్ట్‌మెంటులో పనిచేసిన ప్రొఫెసర్‌ రావాడా ఎప్పటికీ జ్ఞప్తికివస్తాడు. పిల్లలను ఉపాధ్యాయులుగా అయ్యేందుకు ప్రోత్సహిస్తారు. అలాంటి ఉపాధ్యాయుల ప్రేరణతో తెలంగాణలో ఎంతోమంది ఉపాధ్యాయవృత్తిలోకి వచ్చారు. ఉపాధ్యాయుల ఎంపిక ప్రభుత్వ నియామకాల ఎంపిక ద్వారా రాదు. తాము చదువుకున్న కాలేజీలు, ఉపాధ్యాయుల స్ఫూర్తివల్ల మాత్రమే పిల్లలను కొత్తతరాలను ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చే విధంగా చేస్తుంది. ఇప్పటికీ చాలా దేశాల్లో ప్రొఫెసర్ల రికమండేషన్ల లెటరే ఉపాధ్యాయవృత్తి ఎంపికకు ఆధారమవుతుంది. తన బోధనా వృత్తిలో విద్యార్థిలో ఉండే అభిలాషను గమనించి మాత్రమే ఆ ప్రొఫెసర్‌ రికమండేషన్‌ లెటర్‌ ఇస్తారు. ఆనాడు తెలంగాణలో యూనివర్సిటీలనుంచి డైరెక్ట్‌గా ఉపాధ్యాయ వృత్తికి వచ్చిన వాళ్లు చాలా మంది ఉన్నారు.

పూర్వపు హైద్రాబాద్‌ రాష్ట్రంలో ఏ బిఇడి చేయని అభ్యర్థులను తీసుకుని నాలుగైదు సంవత్సరాలు స్కూళ్లల్లో పనిచేయించేవారు. అనుభవంగల ఉపాధ్యాయులు ఈ జూనియర్లకు తర్ఫీదునిచ్చేవారు. ఉపాధ్యాయ వృత్తికి కావల్సిన మౌలిక విషయాలను ఈ ట్రైనీ టీచర్‌ నేర్చుకునేవారు. నాకు తెలిదేవర వెంకట్రావుగారు చెప్పిన పాఠాలు. ''రామయ్య జ్ఞాపకాలు'' పుస్తకం ద్వారా చెప్పాను. అవి ఏ ట్రైనింగ్‌ కాలేజీలో నేర్చుకున్నవి కావు. తోటి ఉపాధ్యాయులే కొత్త ఉపాధ్యాయులను సానపడతారు. పిల్లలతో అనుబంధాలను పెంచుకుంటారు. ఒక ఫ్యాష్‌నెట్‌ టీచర్‌గా తయారవుతారు. ఈ శిక్షణ పొందిన తర్వాత ట్రైనింగు కాలేజీలకు పంపించేవారు. దాన్ని ప్రిపేరింగ్‌ ది టీచర్‌ అంటారు. నేను కూడా ఆ విధంగానే ఉపాధ్యాయ వృత్తికి వచ్చి ట్రైనింగ్‌కు పోయాను. చాలా మంది నా మాదిరిగానే ఎన్నో స్కూళ్లల్లో పనిచేసి ఆ తర్వాత ట్రైనింగ్‌ పొందారు. మాలాంటి వారికి ఈ శిక్షణ వల్ల కొంత ఇన్‌ఫర్మేషన్‌ కొన్ని నైపుణ్యాలు నేర్చుకోగలిగాం. అందుకే మొత్తం సర్వీస్‌ అంతా కూడా ఉపాధ్యాయునిగానే ఉండిపోయాను.

ఉపాధ్యాయ వృత్తి మాధుర్యం తెలిసిన వారికి ఇతర ఎన్ని గొప్ప అవకాశాలు కూడా ఆకర్షించలేవు. మంచి ఉపాధ్యాయుడు కావాలంటే విద్యార్థిగా ఉన్నప్పుడే ఆ బీజాలు పడాలి. అలాంటి విద్యార్థిని అప్పుడే పట్టుకుని ఆ విద్యార్థిలో అంతర్లీనమైన లక్షణాలను అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో తర్ఫీదునివ్వాలి. అప్పుడే వాళ్లు శాశ్వతంగా ఉపాధ్యాయులుగా మిగిలిపోతారు. తనకు ప్రతి గడియలో శిక్షణ నిచ్చిన మనుషులను స్మరించుకుంటారు. ఉపాధ్యాయుడు తరగతి గదిలో ప్రవేశించేటప్పుడు తనకు శిక్షణిచ్చిన ఉపాధ్యాయులు జ్ఞప్తికొస్తారు. అదే ఉపాధ్యాయునికి తిరుగులేని బలం. పిల్లలను చూడగానే తన బాల్యంలో ప్రతిభ బైటకు వస్తుంది. తరగతి గది నుంచి బైటకు వచ్చాకనే ఆ ఉపాధ్యాయుడు మామూలు మనిషి అయిపోతాడు. ఈనాడు ఫిన్లాండ్‌, సింగపూర్‌లలో ఉపాధ్యాయ నియామకాల్లో ఈ పద్ధతులను అవలంబిస్తున్నారు. ఉపాధ్యాయుడి వృత్తి రహస్యం పాలసీలలో వుండదు. ఆచరించే ఉపాధ్యాయులలో వుంటుంది.

Please mark me as brain list

BY Tolety Roshan

Similar questions