India Languages, asked by beverly92, 9 months ago

నీ యాయుస్సూత్రము లీవ త్రుంచుకొనెదో? పై వాక్యానికి అర్థసందర్భము వ్రాయండి.

Answers

Answered by MaIeficent
21

Explanation:

మీ ప్రశ్న;-

నీ యాయుస్సూత్రము లీవ త్రుంచుకొనెదో?

సమాధానం

పరిచయం:-

ఈ వాక్యం శ్రీ గడియారం వేంకట శేష శాస్త్రి గారు రచించిన మాతృభావన అను పాఠము లోనిది. ఈ పాఠము శ్రీ శివభారతము నందలి తృతీయా శ్యాసం నుండి గ్రహింపబడినది. ఈయనకు కవిసింహ, అవధాన పంచానన అను బిరుదులు కలవు. ఈయన కాలం 20వ శతాబ్దం.

సందర్భం:-

అబ్బాజీ సోన్ దేవుడు రాణివాస స్త్రీలను బందీలుగా తీసుకు వచ్చినప్పుడు ఆవేశంతో రగిలిపోయిన శివాజీ పలికిన సందర్భములోనిది ఈ వాక్యం.

భావం:-

విజయ గర్వం మత్తులో చెలరేగి నీ ప్రాణానికి నీవే ఆపద తెచ్చుకుంటావా? నీవు తేసిన ఈ తప్పుని నేను సహించనని శివాజీ కోపాన్ని ప్రదర్శించాడని పై వాక్యానికి భావం.

Similar questions