India Languages, asked by Reshma678, 9 months ago

అమరావతిలోని శిల్పాల గొప్పతనం గురించి తెలపండి? అమరావతి శిల్పకళలకు కాణాచి అని ఎలా చెప్పగలరు?

Answers

Answered by MaIeficent
32

Explanation:

మీ ప్రశ్న:-

అమరావతిలోని శిల్పాల గొప్పతనం గురించి తెలపండి?

అమరావతి శిల్పకళలకు కాణాచి అని ఎలా చెప్పగలరు?

సమాధానం:-

అమరావతి అద్భుతమైన శిల్పకళలకు కాణాచి. అశోకుడు ఇక్కడ మహా బౌద్ధ స్తూపం నిర్మించాడు. దానికి ఆచార్య నాగార్జునుడు మహా ప్రాకారాన్ని నిర్మించాడు.

దంతగిరి, నేలకొండపల్లి, ధుళికట్ట, భట్టిప్రోలులలో లభించిన శిల్పాలను " అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ " అంటారు. పల్నాడు పాలరాయిపై చెక్కిన 120 కి పైగా అమరావతి శిల్పాలు , బ్రిటిష్ మ్యూజియంలో

నేటికీ ఉన్నాయి. అవి అమరావతి శిల్ప గొప్పతనాన్ని ప్రపంచానికి వెల్లడిస్తున్నాయి.

మరి కొన్ని అమరావతి శిల్పాలు మద్రాసు, కలకత్తా మ్యూజియంలో దాచారు. ప్రపంచ శిల్పాలలో అమరావతి శిల్పాలు చాలా గొప్పవని, గొప్ప శిల్పకళా పరిశోధకుడైన ఫెర్గూసన్ చెప్పడు. దీనిని బట్టి అమరావతి గొప్ప శిల్పకళలకు కాణాచి అని మనం చెప్పవచ్చు .

అమరావతి శిల్పాలలో ఆనందం, విషాదం, క్రోధాం, కరుణ, దయ, ప్రేమ, వీరత్వం, ఆరాధన వంటి భావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. గాంధార, మధుర, శిల్పకళారీతులతో సమానంగా అమరావతి శిల్పకళ ప్రాచుర్యం పొందింది

Answered by Anonymous
7

అమరావతి అద్భుతమైన శిల్పకళలకు కాణాచి . అశోకుడు నిర్మించిన మహా బౌద్ధ స్తూపానికి ఆచార్య నాగార్జునుడు మహా ప్రాకారాన్ని నిర్మించాడు . క్రీ.శ. 1779 లో మద్రాసు ప్రెసిడెన్సీలో సర్వేయరుగా పని చేసిన ' కల్నల్ కాలిన్ మెకంజీ ' అమరావతి శివారు ప్రాంతంలో వున్న ' దీపాల దిన్నె ' అని పిలిచే మట్టిదిబ్బ దగ్గర చెల్లాచెదురుగా పడివున్న అద్భుత శిల్ప సంపదను గుర్తించాడు . అమరావతి స్తూపం సమున్నత దశలో ఉన్నప్పుడు ఇక్కడి బౌద్ధ భిక్షువులు రోజూ ఇక్కడ వేలాదిగా దీపాలు వెలిగించేవారట . అందువల్ల ఈ ప్రదేశానికి ' దీపాల దిన్నె ' అనే పేరు వచ్చింది . బుద్ధుని జీవిత ఘట్టాలను శిల్పాలుగా మలచడానికి వితరణ చేసిన వారి పేర్లు శాసనాల్లో లిఖించారు . ఒక చర్మకారుడు పూర్ణకుంభ శిల్పాన్ని తన వంతుగా దీపాల దిన్నెపై చెక్కించాడు . అనాదరణకు గురైన ఆ శిల్పసంపద మెకంజీని ఆకర్షించింది . ఆ శిల్ప సంపద గురించి బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేశాడు .

Similar questions