తెలుగు భాషాభివృద్ధిలో నేటితరం కీలక పాత్ర
Answers
Answer:
Explanation:స్వాతంత్ర్యం వచ్చేనాటికి మాతృభాషామాధ్యమం పాఠశాల చివరితరగతి (1-11) వరకు ఉండేది; ఇంగ్లీషు ఒక పాఠ్యాంశంగా 6వతరగతినుంచి, మాధ్యమంగా ఇంటర్ మీడియేట్ నుంచి కళాశాలస్థాయిలో ఉండేది. దేశమంతటా ఈమార్పు రావటానికి ఆంగ్ల పాలకుల విద్యావిధానమే కారణం. ఈప్రయత్నం 70ఏళ్ళ తర్వాత 1920నుంచి సమగ్రంగా అమలైంది.
‘ప్రజలభాషలో రాష్ట్రపరిపాలన జరగటం ప్రజాస్వామ్యానికి అవసరం’ అనే ఆదర్శంతో భాషాప్రయుక్తరాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత దేశభాషలకు సముచితస్థానం ఇవ్వటానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరిగాయి. ప్రధానభాషల (Eighth Schedule languages) ను అధికారభాషలుగా గుర్తించటం, విద్యావిధానంలో పట్టభద్రస్థాయిదాకా దేశభాషామాధ్యమం ప్రవేశ పెట్టటం, గ్రంథఅకాడమీల, సాహిత్యఅకాడమీల స్థాపన, మొదలైనవి. తెలుగులో 1957లో సాహిత్యఅకాడమీ, 1968లో తెలుగు అకాడమీ వచ్చాయి. 1969-1974కి తెలుగుమాధ్యమం పి.యు.సి. నుంచి బి.ఏ., బి.కామ్., బి.ఎస్ సీ. లస్థాయిదాకా వ్యాపించింది. ఆ తర్వాతనే తెలుగుకు క్రమంగా ప్రాధాన్యం తగ్గిపోయింది. ప్రధాన కారణం: ఇంగ్లీషుమీడియమ్ లో చదువుకున్నవాళ్ళకు ఉద్యోగావకాశాలు పెరగటం, తెలుగు మాధ్యమం నిరుపయూగం అనేభావం చదువుకున్నపిల్లల్లోనూ, తల్లిదండ్రుల లోనూ గట్టిగా పాతుకోటం. ఇది మరో ముప్ఫై ఏళ్ళకు తారస్థాయికి చేరుకున్నది. LKG నుంచే ఇంగ్లీషులో చదువునేర్పటం అవసరమనే అపోహ చాలావర్గాల్లో కలగటం, పనిపాటలు చేసుకునే వాళ్ళుకూడా ఈ దోవ తొక్కటం విశేషం. పార్లమెంటు అంగీకరించిన భారతదేశవిద్యావిధానం తల్లకిందులైంది.
ఇంగ్లీషుమీడియం లో చదివినవాళ్ళకు చదువు ఎంతబాగా పట్టుబడుతున్నదో తెలుసుకోటానికి “ఇండియా టుడే” వారపత్రిక ఇటీవల (2006 నవంబర్ 27సంచికలో[2]) ఒక జాతీయపర్యవేక్షణ చేసి వచ్చిన ఫలితాలను ప్రచురించింది. మొత్తం 5 నగరాలనుంచి 142 అతిశ్రేష్ఠపాఠశాలలను తీసుకొని 4, 6, 8 తరగతుల్లో ఉన్న 32,000 మంది విద్యార్థులను శాస్త్రీయంగా ఎంపికచేసింది. వాళ్ళకు ఆరుప్రశ్నలిచ్చి వారు రాసిన జవాబులకు మార్కులువేశారు. అలానే 43 ఇతరదేశాల్లో అదే తరగతులపిల్లలకు ఆప్రశ్నలిస్తే వచ్చిన జవాబులకు మార్కులు వేసి, రెంటినీ పోల్చిచూస్తే, అంతర్జాతీయ స్థాయి విద్యార్థుల మార్కులు 60 శాతం పైన ఉంటే మనపిల్లలు 40 శాతం మార్కులలోపలే ఉన్నారని తెలిసింది.