India Languages, asked by degasantosh, 6 months ago

ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణి ల స్నేహ సంబంధానికి ఆనవాళ్లు​

Answers

Answered by ASHRITHRASAKATLA
0

Answer:

ఆచార్య నాగార్జునుడు (క్రీ. శ. 150-250) ప్రసిద్ధి గాంచిన బౌద్ధ ధర్మ తాత్వికుడు. కనిష్క చక్రవర్తి సమకాలికుడైన అశ్వఘోషుడు మహాయాన బౌద్ధ మతాన్ని ప్రవచించాడు. అందలి మాధ్యమిక సూత్రములను నాగార్జునుడు రచించాడు. ఈ మాధ్యమిక తత్వము చైనా దేశానికి మూడు గ్రంథములు (సున్ లున్) గా వ్యాప్తి చెందింది. ఆచార్య నాగార్జునుడు మహాయానం విశేష వ్యాప్తి చెందటానికి కారకుడు. ప్రజ్ఞాపారమిత సూత్రములు కూడా నాగార్జునుడే రచించాడని అంటారు. నలందా విశ్వవిద్యాలయములో బోధించాడు. జోడో షింషు అను బౌద్ధ ధర్మ విభాగమునకు ఆద్యుడు. నాగార్జునిని రెండవ బుద్ధుడని కూడా అంటారు.

నాగార్జునుని జీవితము గురించి మనకు చాల తక్కువగా తెలియవచ్చింది. ఛైనా, టిబెటన్ భాషలలో నాగార్జునుని జీవిత చరిత్ర Athani మరణము తరువాత పలు శతాబ్దములు గడచిన పిదప వ్రాయబడింది. కొన్ని ఆధారములను బట్టి ఈతడు అంధ్ర దేశానికి చెందిన వైదీక బ్రాహ్మణుడు. నాగార్జునుడు బాల్యంలోనే సన్యసించి హిందూ తత్వశాస్త్రాన్ని ఆభ్యసించాడు. ఆ తర్వాత బౌద్ధమతాన్ని స్వీకరించాడు. నాగార్జునుడు విదర్భకు చెందినవాడని మరియొక అభిప్రాయము. వేదశాస్త్రములలో పాండిత్యము సంపాదించి హిమాలయములలో విస్తృతముగా పర్యటించి బౌద్ధము పట్ల ఆకర్షితుడై నలందా చేరాడు. అచట ప్రఖ్యాత ఆచార్యుడు రాహులభద్ర వద్ద శిష్యరికము చేసి నలందాలోనే అచార్యునిగా పలు సంవత్సరాలు బోధించాడు. పిదప కృష్ణానదీ లోయలోని శ్రీపర్వతము చేరి స్థిరపడ్డాడు. దగ్గరలోని ధాన్యకటకములోని విశ్వవిద్యాలములో ముఖ్య అచార్యునిగా బోధలు చేశాడు.

నాగార్జునుని అభిప్రాయము ప్రకారము బుద్ధ భగవానుడే మాధ్యమిక పద్ధతికి కారణభూతుడు. కలుపహణ అభిప్రాయమును బట్టి నాగార్జునుడు మొగ్గలిపుత్త తిస్స వారసుడు, మాధ్యమిక పద్ధతిలో బుద్ధుని మౌలిక బోధలను పునరుజ్జీవనము చేసిన మహనీయుడు.

ఈయన చేత ప్రభావితుడైన శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి, శ్రీ పర్వతం (నాగార్జున కొండ) పై ఒక బౌద్ధ విద్యాలయమును/విహారం-(మహచైత్యవిహారం/పారావత విహారం) కట్టించి, నాగార్జునుడిని అధ్యాపకునిగా నియమించాడు. ఈ విహారం లొ 5 అంతస్తులు,1500 గదులు కలవని చైనా యాత్రీకుడు-'ఫాహియన్'పేర్కొన్నాడు.ఈ విద్యాలయం నాగార్జునుని ప్రతిభ వల్ల జగత్ప్రసిద్ధిని పొందింది. ఈ విద్యాలయములో చదువుకొనుటకు అనేక దేశాలనుండి విద్యార్థులు వచ్చేవారు.

నాగార్జునుడు వ్రాసిన ముఖ్య గ్రంథాలు:

మూలమాధ్యమికకారిక

మహాప్రజ్ఞానపరమితశాస్త్ర

ద్వాదశనికాయశాస్త్ర

దశభూమివిభాసశాస్త్ర

శూన్యతాసప్తతి

యుక్తిసస్తిక

విగ్రహ వ్యావర్తని

సుహ్రిల్లేఖ

రత్నావళి

Explanation:

Similar questions