English, asked by mmesinensai, 7 months ago

అ) ధర్మరాజు వ్యక్తిత్వాన్ని గురించి మీ సొంతమాటల్లో రాయండి.
అ) మీకు తెలిసిన మంచిగుణాలు కలిగిన ఒకరిని గురించి 'అభినందన వ్యాసం రాయండి.
ఇ) పాండవులు
పాండవులు ఉదార స్వభావుల, పాండవులు దాతృత్వము
ఇవంకామము, నేర్పరితనము, మొదలైన గుణములు కలవారు . ముఖ్యంగా
దాయాలను ఆభరణంగా కలచారు.
00000000000000000000
2.
కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.
ఆ) పాఠం ఆధారంగా చేమకూర వేంకటకవి గురించి ప్రశంసిస్తూ రాయండి.
III.
భాషాంశాలు​

Answers

Answered by aadesahaja06
9

జవాబులు:

2.అ) ధర్మరాజు యమధర్మరాజు యొక్క వరపుత్రుడు. యమధర్మరాజు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం తాను కూడా ప్రవర్తించాలన్న దీక్ష కలవాడు. శాంతి, దయ అనే మహా గుణాలనే ఆభరుణాలుగా ధరించినవాడు. దానం చేయడమనే విద్య పట్ల ఆసక్తి గల మనసున్నవాడు. నిశిత పరాక్రమం కలవాడై విశేషంగా రాజ్యపాలన చేస్తూండేవాడు. నిజం చెప్పడంలోని స్వరస్యాన్ని బాగా తెలిసినవాడు. మంచి వారిని ఆదరించి పోషించేవాడు. అటువంటి ధర్మరాజును గూర్చి ఆ ఇంద్రప్రస్థ ప్రజలంతా "మేలు, బళి!" అంటూ జేజేలు పలుకుతున్నారు. ఇతరుల గురించి చాటుమాటుగా ఎప్పుడు మాట్లాడడు. ముఖ ప్రీతి కోసం మంచి మాటలు అస్సలు చెప్పడు. ఏదైనా సాయం కోసం మనవి చేసుకుంటే ఆ సాయాన్ని తప్పకుండా చేస్తాడు.

3.అ) దాతలకే దాత, మహాదాత బలిచక్రవర్తి. దాన ధర్మాలు చేయడంలో తనకు తానే సాటి అనిపించుకున్న వ్యక్తి. ఒకసారి మాట ఇస్తే ప్రాణం పోయినా మాటతప్పని నైజం బలిని మహాదాతల స్థానంలో నిలిపింది. యజ్ఞ యాగాలు చేయడం, అడిగిన వారికి లేదనకుండా దానం చేయాలని కంకణం కట్టుకున్న మహాచక్రవర్తి. పురాణాల్లో ప్రహ్లాదుడికి మనవడు, విరోచనుడికి కుమారుడైన బలి యజ్ఞయాగాలు, దాతృత్వంతో వచ్చిన శక్తితో స్వర్గలోకాన్నే ఆక్రమించగలుగుతాడు. ఆయన నర్మదా నది తీరాన యాగం చేస్తుండగా విష్ణుమూర్తి వామనావతారంలో బలిని యచించడానికి వస్తాడు. మూడడుగుల నేలను దానం చేయమని కోరతాడు. అది చూసి బలి గురువైన శుక్రాచార్యుడు మోసాన్ని గ్రహించి వచ్చినవాడు సామాన్యుడైన వామనుడు కాడు, విష్ణుమూర్తి అనే సందేహాన్ని వెలిబుచ్చుతాడు. దానం ఇవ్వడం మానుకోకుంటే నీ రాజ్యం, సంపదలు కోల్పోతావని హెచ్చరిస్తాడు. బలి మాత్రం గురువు మాటలను పట్టించుకోలేదు. ఒకసారి మాట ఇస్తే హరి హరాదులొచ్చినా, ధన, మాన, ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా మాట తప్పనని అంటాడు. చివరకు వామనుడికి దానం చేయడానికి సిద్ధపడతాడు. వామనావతారంలో ఉన్న విష్ణుమూర్తి ఒక అడుగుతో భూలోకాన్ని ఇంకొక అడుగుతో స్వర్గలలోకాన్నీ ఆక్రమించుకున్నాడు. విష్ణుమూర్తిని గ్రహించిన బలి మూడవ అడుగును తన తలపై పెట్టమని అంటాడు. దానగుణ సంపన్నులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇచ్చిన మాటకు కట్టుబడతారని నిరూపించిన బలిచక్రవర్తి అభినందనీయుడు.

ఆ) ప్రబంధయుగాన్ని దాటి దక్షిణాంధ్రయుగంలోకి సాహిత్యం అడుగుపెట్టాక ఆ శైలిలో అత్యున్నత స్థాయిని అందుకున్న కవి చేమకూర వెంకట కవి. ఆశ్చర్యమైన, అధ్భుతమైన చమత్కారాలతో కళ్లు మిరుమిట్లు గొలి వేలా చేస్తారంటూ ఆయన శైలిని సాహిత్యవేత్త బేతవోలు రామబ్రహ్మం ప్రశంసించారు. చేమకూర వెంకటకవి ప్రతిపద్యము చమత్కృతికి నిదర్శనం. ఈ కవి మనం వాడుకొనే శబ్దాలతోనే సులభంగా రెండు అర్థములను సాధిస్తాడు. ఉదాహరణకు ఈ పద్యంలో జయంతుని తమ్ముడు అర్జునుడు-ఇక్కడ జయంతుడు ఇంద్రుని కుమారుడు, సౌందర్యానికి లోకప్రసిద్ధుడు అర్జునుడు ఇంద్రుని వరపుత్రుడు-కాబట్టి జయంతుడు, అర్జునుడు సోదరులు అందంలో జయంతుని వంటి వాడని శ్లేష సాధించబడింది. అట్లే ఈ పద్యంలో ప్రతి పాదానికి శేషంగా రాసి పెట్టాడు చేమకూర వెంకటకవి.

Similar questions