శ్రుంగబేరి పురానికి రాజు ఎవరు?
Answers
Answer:
Vijayavilaasamu (విజయవిలాసము)
ప్రస్తావన:
కృష్ణదేవరాయల పరిపాలన తెలుగు సాహిత్య చరిత్రలో సువర్ణాక్షర లిఖిత మైనది. ఆ కాలంలో తెలుగు సాహిత్య సరస్వతి సర్వతో ముఖంగా అభివృద్ధి చెందినది. రాయల వారు భాషా సాహిత్య పోషకులేకాక, బహు భాషా కోవిదులై స్వయంగా "ఆముక్తమాల్యద" వంటి ప్రబంధాన్ని రచించి పేరుగాంచిన సాహిత్య సమరాంగణ చక్రవర్తి. ఒక చక్కని సాహిత్య సంప్రదాయ చైతన్యమును చరిత్రలో సృష్టించిన మహా మనీషి రాయలవారు! తెలుగు సాహిత్యం అనువాద పద్ధతిని అధిగమించి, స్వతంత్ర కావ్య రచన పద్ధతి మొదలెట్టినది రాయలవారి యుగం లోనే!
తర్వాత కాలంలో తంజావూరి నేలిన రఘునాథ నాయక రాజు, ఆంధ్ర భోజునివలె, తెలుగు సంస్కృత భాషల లోను, సంగీత భరత నాట్య శాస్త్రాల యందును అఖండ పాండితి నార్జించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. స్వయంగా (పుష్టిగల) బహు కావ్య నిర్మాత. ఉద్దండ సంస్కృత పండితుడైన యజ్ఞనారాయణ దీక్షితునికి గురువు కాగలిగిన మహావిద్వాంసుడు.
కృష్ణదేవరాయల వారి "భువన విజయము" వలే రఘునాథ నాయకునికి, "విజయభవన" మను ప్రసిద్ధ సభామందిర మున్నట్లు చరిత్రలో పేర్కొన బడినది. అందు బహు శాస్త్రవేత్తలు, కవులు, గాయకులు, నట్టువరాండ్రు మొదలైన పలువురు ప్రసిద్ధులు రఘునాథ నాయకుని కొలువు నలంకరించి ఉండెడివారని చరిత్ర చాటుచున్నది. అంతేకాక, రఘునాథనాయకుని సభాంగణానికి, దేశము నలువైపుల నుండి విద్వాంసులు వచ్చి పాల్గొంటూ ఉండేవారని, ఆవిద్వత్సభ లో మాట్లాడుటకు యెంతటి ప్రజ్ఞావంతులైనా వెనుకాడే వారని ప్రతీతి. "విద్వద్ కవీనాం విదధాసి హర్షం" అని రఘునాథనాయకుని గురువు, మంత్రి అయిన గోవింద దీక్షితుడు "సంగీతసుధ" లో ప్రశంసించి యున్నాడు. అంతటి సర్వతో ముఖ ప్రజ్ఞాశాలి అయిన రఘునాయక రాజు ఆస్థానానికి చెందిన వాడు చేమకూర వేంకటకవి.!
తన జీవితాన్ని గూర్చి వేంకట కవి చెప్పినది చాలా తక్కువ. ఇతరులు అతనిని గురించి చెప్పిన మాటలను బట్టి, విజయవిలాస కావ్య ఆశ్వాసాంత గద్యాలను బట్టి మనం ఆయన జీవితాన్ని పునర్నిర్మించు కోవాలి. అది అత్యంత అవసరం. ఎందుకంటే కవిని గూర్చి బాగా తెలియక పోతే ఆయన రచనను సరిగా అవగాహన చేసుకొనలేము. అందుచేత కవిని గూర్చిన వివరాలు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
మనకు తెలియ వచ్చిన వివరాల ననుసరించి శ్రీయుతులు వేంకట కవిగారికి చిన్న వయసులోనే కవిత్వ మబ్బినట్లు పేర్కొన బడినది. దీనిని సూర్యనారాయణ వర ప్రసాదంగా చెప్పు కొంటారు. వేంకటకవి తెలుగు సాహిత్యం సుప్రసిద్ధ గురువుల పాదాల చెంత నేర్చు కొనినట్లు గాని, సంస్కృత భాషలో పాండిత్యము సంపాదించి నట్లు గాని దాఖలాలు పరిశోధకులకు లభ్యం కాలేదు. అయినప్పటికీ, రాజుగారు నిర్వహించే పండిత గోష్టులలో పాల్గొంటూ అచ్చట జరుగు సాహిత్య చర్చలను శ్రద్ధగా వింటూ, తనకు తెలియని విషయాలు అచ్చటి పెద్దల నడిగి తెలుసుకుంటూ ఉండేవాడని, అలా తెలియ జెప్పిన పెద్దలనే చేమకూర వేంకట కవిగారికి గురువులుగా భావించ వలసి ఉంటుందని అభిప్రాయాన్ని చాలామంది వ్యక్త పరచారు. విజయవిలాస కావ్య రచనకు ముందుగానే చేమకూర కవిగారికి కావ్య రచన చేయాలన్న కుతూహలం కలిగిందట. సారంగధర అనే కావ్య రచన ఆరంభించాడు. తీరిక కల్గినప్పు డల్లా ఆరచన లోని కొంత భాగం పండితులైన వారికి వినిపించి వారి విమర్శన తెలుసు కొనడమూ మొదలెట్టాడు. ఆవిషయం పండితులు మెల్లగా విద్వద్గోష్టిలో రఘునాథ నాయక రాజు గారి దృష్టికి తెచ్చారు. ఆవిధంగా చేమకూర వేంకట కవి కవనము లోని మంచిని రఘునాథరాజు గుర్తించ గలిగారు. గోష్టివారి మెప్పులవల్ల మరింత ఉత్సాహంతో సారంగధర రచన సాగించాడు. సాహిత్య విమర్శతోపాటు, ఆత్మ విమర్శ కలవాటు పడ్డ చేమకూరకవి తన సారంగధర కావ్యంలో అక్కడక్కడా రచన అపరిపక్వ స్థితిలో ఉన్నదనీ, కొన్ని కల్పనలు కుంటుతూ ఉన్నాయన్న సంగతి గుర్తించ గలిగాడు. అందుకే ఆ కావ్యంలో ఎన్ని అమోఘమైన విషయాలున్నా, ఎంతటి కవితా విశేషమున్నా, అది గౌరన కృతికి అనుకరణ కాబట్టి, స్వతంత్ర రచన అనిపించుకోదు. అందుకని "విజయవిలాస" రూపంలో మరో స్వతంత్ర కావ్య రచన కు సంకల్పించాడు. మరోవిషయం, తంజావూరు రాజ్యం రఘునాథనాయక రాజు పాలనలో విజయ పరం పరలతో విజృంభించి, పాడి పంటలతో సంవృద్ధిచెంది, శిరి సంపదలతో నిత్య కల్యాణం పచ్చ తోరణంగా ఉండేదిట! అటువంటి స్థితిలో ప్రజలను ఆకర్షించేది, ఆహ్లాద పరిచేది శృంగార రసమేకాని, మరొకటి కాదని వేంకటకవి నిశ్చయించు కొన్నాడు. తానుచేసిన సారస్వత కృషికీ, తనకున్న భావసంపదకూ శృంగార రసము చక్కగా అమరుతుందని ఊహించాడు. శృంగారమే ఏకైక రసంగావుండే కథ కావ్య రూపంలో వ్రాయాలనుకొని "విజయవిలాసము" ఎత్తుకున్నాడు. ఫలితంగా "విజయవిలాస" కావ్యం రూపొందింది. పలువురు పండితుల మన్ననల నందుకొన్న ఈప్రబంధము రఘునాథ నాయక రాజుపై తనకు (చేమకూరకవికి) ఉన్న గౌరవాతిశయానికి తగినట్టు తన కావ్యాన్ని తనకు తానై అంకిత మివ్వడానికి సిద్ధమయ్యాడు. ఉత్తమ కావ్య గుణాలతో విరాజిల్లు గ్రంథాలను ఎన్నోవ్రాసిన రఘునాయకరాజుకు కృతిని ఇవ్వడానికి యోగ్యమైన కావ్య రచన కోసం చేమకూర వేంకటకవి బహుధా తపస్సు చేశాడని చెప్పడం సమంజసంగా వుంటుంది. ఆతపః ఫల ఫలితంగానే "విజయవిలాసం" అనే కావ్యాన్ని సర్వాలంకార శోభితంగా తీర్చిదిద్ద గలిగాడు.
విజయవిలాసము - కథావస్తువు.
రసవత్తరమైన ఈ కావ్యం మూడు అశ్వాసాలలొ రచింప బడినది. ఈ కథకు మూలం మహాభారతం - ఆదిపర్వంలోని సుభద్రా వివాహం. భారత కథలో అవసర మైన కొన్ని చక్కని మార్పులు చేసి, ప్రత్యేక్ష చమత్కారముతో పరిపక్వమైన తన నైపుణ్యానంతా చొప్పించి స్వతంత్ర కావ్యంగా "విజయవిలాసాన్ని" రూపొందించారు రచయిత చేమకూర వేంకటకవి.
ఈ కావ్యంలో నాయికలు ముగ్గురు! ముగ్గురూ మూడు రకముల వారు. ఉలూచి పాతాళ కన్య, చిత్రాంగద మర్త్య కన్య, సుభద్ర అవతార పురుషులైన బలరామ కృష్ణుల ముద్దుల చెల్లెలు కావున దేవకన్య. మరో విష మేమిటంటే నన్నయ భారతంలో వర్ణితమైన ఉలూచి తనను గూర్చి "ఏ నులూచి యను నాగకన్యక నైరావత కుల సంభవుండయిన కౌరవ్యుని కూతుర" ... అని చెప్పింది. కాని సంస్కృత భారతం భీష్మ పర్వంలో –
"ఐరావతేన సాదత్తాహ్య నవత్యా మహాత్మ నా
పత్యాహతే సువర్ణేన కృపాణ దీన చేతసా
Well I cannot understood your language but I have searched this from google
భార్యార్థం తాంచ జగ్రాహః కామవశానుగాం"