World Languages, asked by dangerdevil519, 6 months ago

రామాయణాన్ని ఎందుకు చదవాలో రాయండి​

Answers

Answered by LastShinobi
14

Answer:

హే బడ్డీ

రామాయణుడు శ్రీ రాముడు జన్మించిన రోజు నుండి తిరిగి వైకుంఠానికి బయలుదేరిన రోజు గురించి మాట్లాడాడు. ఇది ఇక్ష్వాకు రాజవంశం యొక్క గొప్ప రాజు గురించి, గొప్ప ish షుల గురించి మరియు ప్రజల గురించి మాట్లాడుతుంది

Explanation:

దయచేసి మెదడుగా గుర్తించండి నన్ను అనుసరించండి అబ్బాయిలు

Please mark as brainliest

Follow me guys

Answered by sare83
33

ప్రశ్న:

రామాయణాన్ని ఎందుకు చదవాలి....

జవాబు:

"రామాయణం" మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం. ఈ కథ మానవ హృదయాలపై ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసింది. రామాయణం జీవితానికి అవసరమైన ఎన్నో విలువల్ని అందిస్తుంది.

      రామాయణంలో అమ్మానాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యభర్తల సంబంధం, గురుభక్తి, శి‌ష్యానురక్తి, స్నేహఫలం ధర్మబలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన వంటి పాఠాలు ఎన్నో కనబడతాయి.

      రామాయణాన్ని చదవడం అంటే, జీవితాన్ని చదవడమే. రామాయణం ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమమైన ధర్మాలను ఆచరిస్తే, మనిషి మనీషిగా ఎలా ఎదగగలడో రామాయణం నేర్పుతుంది. చిన్నచిన్న పాత్రల ద్వారా రామాయణం గొప్ప సందేశాన్ని అందిస్తుంది.

           రామాయణంలో మారీచుని వంటి రాక్షసుని నోటి నుండి, "రామో విగ్రహవాన్ ధర్మః సాధాః సత్య ధర్మః పరాక్రమః" అనే గొప్ప మాటలు వెలువడతాయి.

           రాముడి వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శకావ్యం "నభూతో నభవిష్యతి!" అంటే 'పూర్వ మందు లేదు, ముందు కాలంలో రాబోదు' మానవ మనుగడ ఉన్నంతవరకూ రామాయణం ఉంటుంది.

          రామాయణం ప్రపంచ సాహిత్యంలోనే 'ఆదికావ్యం' వాల్మీకి మహర్షి సంస్కృతంలో దీనిని ఆరు కాండాలతో 24 వేల శ్లోకాలతో రాశాడు. రామాయణం ముందు తరాల వారికి స్ఫూర్తినిస్తుంది. అందువల్లే మనం రామాయణాన్ని తప్పక చదవాలి.

Similar questions