'అర్జునునికి సాటి వీరుడు ఎవరూ లేరు."
వివరించండి?
Answers
Answer:
అర్జునుడు పాండవ మధ్యముడు. మహాభారత ఇతిహాసములో ఇంద్రుడి అంశ, అస్త్రవిద్యలో తిరుగులేని వీరుడు. పాండు రాజు సంతానం. కుంతికి ఇంద్రుడుకి కలిగిన సంతానం.
Explanation:
పాండు రాజుకు మొదటి భార్యయైన కుంతీదేవి ద్వారా సంతానం కలుగలేదు. కుంతీ దేవికి చిన్నతనంలో దుర్వాస మహాముని నుంచి ఒక వరాన్ని పొంది ఉంటుంది. ఈ వరం ప్రకారం ఆమెకు ఇష్టమైన దేవతలను ప్రార్థించడం ద్వారా సంతానం కలుగుతుంది. కుంతీ దేవి మొదట యమ ధర్మరాజును ప్రార్థించింది. యుధిష్టురుడు జన్మించాడు. వాయుదేవుని ప్రార్థించింది; భీముడు జన్మించాడు. చివరగా దేవేంద్రుని ప్రార్థించింది. అర్జునుడు జన్మించాడు.అలాగే కుంతి మాద్రీ దేవికి ఆ మంత్రం ఉపదేశించి ఒక్కసారిమాత్రమే ఇది పనిచేస్తుంది నీకు ఎవరు కావాలో కోరుకొమ్మనగా ఆవిడ తెలివిగా ఒకే మంత్రానికి ఇద్దరు జన్మించేలా దేవవైద్యులైన అశ్వినీ దేవతలను ప్రార్థంచి ఇద్దరు పిల్లలను పొందింది. ఇలా పంచపాండవుల జననం జరిగింది.
మహాభారత సంగ్రామంలో అర్జునునిది చాలా కీలకమైన పాత్ర. యుద్ధ రంగంలో నిలిచి తన బంధువులను, హితులను, సన్నిహితులనూ చూసి అర్జునుడు మొదట యుద్ధం చేయనని వెనకడుగు వేస్తాడు. కానీ రథ సారథి,, బావయైన శ్రీకృష్ణుడు కర్తవ్యాన్ని ఉపదేశిస్తాడు. దీనినే హిందూ సంస్కృతిలో భగవద్గీత అంటారు. ఇది హిందువులకు చాలా పవిత్రమైన గ్రంథం