రుగాగమ సంధి సూత్రం.
Answers
Answered by
0
Explanation:
రుగాగమ సంధి:– కర్మధారయంబున ‘పేరాది’ శబ్దాలకు ‘ఆలు’ శబ్దం పరమైనప్పుడు రుగాగమంబగు. పేరాది శబ్దాలు: పేద, బీద, ముగ్ధ, కొమ, జవ, మనుమ, ఐదవ మొదలైనవి. ఉదా: పేద (ర్) + ఆలు = పేదరాలు. పరస్వరానికి ముందు ‘ర్’ కారం చేరి పేదరాలు రూపం వచ్చింది. మనుమ(ర్) + ఆలు = మనుమరాలు. కర్మధారయంబున తత్సమ పదాలకు ‘ఆలు’ శబ్దం పరమైనప్పుడు అత్వంబునకు ఉత్వంబు రుగాగమవుతుంది. (తత్సమ శబ్దాలు: ధీర, గుణవంత, ధనవంత, సంపన్న, గంభీర, ధైర్యవంత మొదలైనవి) ఉదా: ధీర + ఆలు = ధీరు+ ర్ + ఆలు = ధీరురాలు; గుణవంత + ఆలు = గుణవంతు + ర్ +ఆలు= గుణవంతురాలు.
Similar questions