వాక్యవిజ్ఞానం :- (సంక్లిష్ట, సంయుక్త వాక్యాలు)
విమల వంట చేస్తుంది. విమల పాటలు వింటుంది - ఈ వాక్యాన్ని సంక్లిష్ట వాక్యంగా మార్చిరాస్తే ()
ఎ) విమల వంట చేస్తుందా? పాటలు వింటుందా? బి) విమల వంట చేస్తూ పాటలు వింటుంది
సి) కమల వంట చేస్తూ పాటలు వింటుంది డి) విమల వంట చేయదు పాటలు వినదు.
ఏ
(TELUGU)
Answers
Answered by
19
బి) విమల వంట చేస్తూ పాటలు వింటుంది
ఇది సరైన జవాబు ✔✔
Answered by
0
Answer:
విమల వంట చేస్తూ పాటలు వింటుంది.
Explanation:
ఇచ్సిన వాక్యం: విమల వంట చేస్తుంది. విమల పాటలు వింటుంది.
ఇది సంయుక్త వాక్యం.
- సంయుక్త వాక్యం అనగా వాక్యంలో కర్త, కర్మ, క్రియలలో ఏవైనా ఒకటి కన్నా ఎక్కువ ఉండి, అవి మరియు, లేదా, కావున, కాబట్టి, వంటి సముచ్చాయలతో సంధానింపబడిన వాక్యం.
- సమ ప్రాధాన్యం కల వాక్యాలను కలపడం వల్ల సంయుక్త వాక్యాలు ఏర్పడతాయి.
ఇచ్సిన వాక్యంలో విమల వంట చేస్తుంది. విమల పాటలు వింటుంది. రెండు సమ ప్రాధాన్యం కల వాక్యాలున్నాయి.
ఈ సంయుక్త వాక్యాన్ని సంక్లిష్ట వాక్యముగా మార్చి రాయాలి.
- సంక్లిష్ట వాక్యము అనగా సంపూర్ణ వాక్యములను, అవాంతర వాక్యములను కలిగియుండి పూర్తి అర్థము నిచ్చు వాక్యము.
- ఒక వాక్యంలో సమాపక క్రియ మరియు అసమాపక క్రియ రెండూ కలిసిన సంక్లిష్ట వాక్యం ఏర్పడుతుంది.
ఇచ్సిన వాక్యాలలో రెంటిలోనూ ‘విమల’ అనే నామవాచకం ఉంది. రెండు సార్లు చెప్పబడిన నామవాచకాన్ని తొలగించి, మొదటి వాక్యంలోని ‘చేస్తుంది’ లోని క్రియను ‘చేస్తూ’ అనే అసమాపక క్రియగా మార్చి రాస్తే సంక్లిష్ట వాక్యం ఏర్పడుతుంది.
కావున, 'విమల వంట చేస్తూ పాటలు వింటుంది' అనునది సరైన సమాధానం.
ఇచ్చిన ఎంపికలలో బి సరైన సమాధానం.
Similar questions