ఇ) ఇతరుల కొఱకు మనం ఎట్లాంటి త్యాగాలను చేయవచ్చో రాయండి.
Answers
Answered by
13
Explanation:
మానవ జన్మ దుర్లభమైంది. దానిని మనం సార్థకం చేసుకోవాలి. మనం తోటివారికి వీలైనంతగా త్యాగం చేయాలి. త్యాగం చేయడం వల్ల ఆత్మసంతృప్తి కలుగుతుంది. స్వార్ధాన్ని కొంత వీడి త్యాగం చేయాలి. కూడు, గూడు లేక ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులకు తన ఆహారంలో కొంత వారికి త్యాగం చేయవచ్చు. విలాసవంతమైన వస్తువులను వాడడం తగ్గించి, ఆ ధనాన్ని పేదలకు అందించాలి. ప్రకృతి వైపరీత్యాలు కలిగినప్పుడు స్వచ్ఛందంగా శ్రమశక్తిని త్యాగం చేయాలి. ప్రమాదాల్లో గాయపడిన వారికి రక్తాన్ని, అవసరమైతే అవయవాలను త్యాగం చేయాలి. ఈ రకంగా మనం తోటివారికి ఎన్నో రకాలుగా త్యాగం చేయవచ్చు..
Similar questions