మంచి తెలుగు యెట్లా వుంటుందో రాయండి ??
Answers
Answer:
అది మన ప్రవర్తనలో వుంటుంది.
Answer:
విషయ వ్యక్తీకరణకు విలువైన మార్గం!
సివిల్స్, గ్రూప్స్, ఎస్‌ఐ తదితర పరీక్షల్లో కొన్ని ప్రశ్నలకు వ్యాసరూప సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో అభ్యర్థి పరిజ్ఞానంతోపాటు భావవ్యక్తీకరణ తీరును, తార్కికమైన ఆలోచనా విధానాన్ని పరిశీలిస్తారు. తెలిసిందంతా రాసేయడం, పదాడంబరాన్ని ప్రదర్శించడం లాంటి పొరపాట్లు చేయకుండా తెలుగు మాధ్యమం అభ్యర్థులు వివరణాత్మక జవాబులను, వ్యాసాన్ని ప్రభావపూరితంగా ఎలా రాయాలో తెలుసుకుందాం.
పోటీపరీక్షల్లో వ్యాసరచన మంచి మార్కులు తెచ్చుకోడానికి ఒక చక్కని మార్గం. తెలుగు మాధ్యమంలో రాసేవాళ్లు కొంచెం జాగ్రత్త వహిస్తే ఎక్కువ మార్కులు సాధించుకోవచ్చు. అర్హత పరీక్షల్లోనూ వ్యాసరచన ముఖ్యమైనదే. వ్యాసం అంటే విస్తరించడం, వివరించడం అని అర్థాలు. ఒక అంశాన్ని వివరించి అంటే పెంచి రాయడం. అంశం ఏదైనా దానికి సంబంధించిన తగిన విషయ పరిజ్ఞానం ఉంటేనే మంచి వ్యాసం రాయడం సాధ్యమవుతుంది.
అర్థమయ్యేలా రాస్తే చాలు!
చక్కటి దస్తూరితో రాయడం మంచి వ్యాసం అనిపించుకోదు. రాతకు సంబంధించి అర్థమయ్యే విధంగా ఉంటే చాలు. వాక్యాల్లో వంకరటింకరలు ఉండకూడదు. కొందరు వాక్యాలను ఏటవాలుగా రాస్తారు. సమంగా రాయాలి. తెలుగు రాసేటప్పుడు భాషాదోషాలపై శ్రద్ధ వహించాలి. భాషాదోషాలంటే వ్యాకరణం ప్రకారం రాయడం కాదు. స్పష్టతతో అర్థభేదాలు లేకుండా రాయాలి.
ఉదాహరణకు- బావి అంటే నుయ్యి. చిన్న వత్తు ఇచ్చేశామంటే భావి అవుతుంది. దానికి అర్థం భవిష్యత్తు. శాకాహారం అంటే కూరగాయల ఆహారం. అదే శాఖాహారం అర్థం కొమ్మలతో ఆహారం. అలాగే పతకం రాయబోయి పతాకం రాస్తే చదివేవాళ్లు అయోమయంలో పడిపోతారు. ఇలా ఒకదాని బదులు ఇంకోటి రాస్తే వ్యాసం లక్ష్యం దెబ్బతింటుంది.
సాధారణంగా వచ్చే తప్పులను కొన్నింటిని పరిశీలిస్తే అవి ఎలా దొర్లుతాయో అర్థం చేసుకోవచ్చు. మొదటి పదం తప్పుగా రాసింది. బ్రాకెట్లో ఉన్నది సరైన ప్రయోగం. విధ్య (విద్య), స్వశ్చం (స్వచ్ఛం), భోదించు (బోధించు), శ్రేష్టం (శ్రేష్ఠం), శతృవు (శత్రువు), రాయభారం (రాయబారం), మహత్యం (మహాత్మ్యం), వర్నం (వర్ణం). కొంతమంది వత్తులు అక్షరాల పక్కన రాస్తుంటారు. దీని వల్ల కూడా అనర్థాలు జరుగుతాయి. అస్పష్టతలకు దారితీస్తుంది.
వాడుక భాషే వాడాలి
తప్పులు లేకుండా రాయాలన్నంత మాత్రాన వ్యాకరణ భాష లేదా మిత్రలాభం (చిన్నయ సూరి) భాష ఉపయోగించాలని కాదు. ఆ భాష రాయడం ఈ రోజుల్లో అనర్థం కూడా. వాడుక భాషలోనే వ్యాసం రాయాలి. అంటే పత్రికా భాష అని చెప్పవచ్చు. పోటీపరీక్షల్లో విషయమే అతి ముఖ్యం. ఆ విషయానికి స్పష్టతను ఇచ్చేది రాత. మనం మాట్లాడే భాషలోనే రాయాలి. కొందరు తమ ప్రాంతీయ భాషా పదాలు (మాండలిక పదాలు) వాడతారు. తప్పుకాదు కానీ ఎగ్జామినర్‌కి తెలియకపోతే మార్కులు తగ్గవచ్చు. అలాంటివి ఉపయోగించినప్పుడు బ్రాకెట్‌లో దాని అర్థాన్ని రాయాలి.
తక్కువగా ఆంగ్ల పదాలు