'తెలంగాణ ఏర్పాటు సంతోషాన్ని'చ్చిందని రచయిత అనటంపై మీ అభిప్రాయాన్ని రాయండి.
'ప్రజల భాష' అంటే మీరేమి అర్థం చేసుకున్నారో రాయండి.
Answers
Answer:
1) తెలంగాణ రాష్ట్రం 2014లో ఆవిర్భవించింది. ఇలా రాష్ట్రం ఏర్పాటు కావడం తనకు సంతోషాన్ని కలుగజేసిందని రంగాచార్యగారు చెప్పారు. అదే సందర్భంలో రంగాచార్యగారు తెలంగాణ వచ్చిందనుకుంటే లాభం లేదని ,వచ్చిన తెలంగాణను కాపాడుకోవాలని ,అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు .
దీన్ని బట్టి దాశరధి రంగాచార్య గారికి తెలంగాణ రాష్ట్రం పట్ల ఎంతో ప్రేమ ఉందని అర్థం అవుతుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న విషయంలో తెలంగాణలో పుట్టిన వారందరూ సంతోషిస్తారని నా అభిప్రాయం
2) రంగాచార్య తన నవలలను ప్రజల భాషలో వ్రాశానని చెప్పారు. ప్రజల భాష అంటే ప్రజలు మాట్లాడుకొనే మాండలిక భాష. నవలల్లో పాత్రలకు వారు పాత్రలచితమైన తెలంగాణలోని మాండలిక భాష వాడారు . రంగాచార్యగారికి తెలంగాణ అంటే అభిమానం. తెలంగాణ యాస సొగసులు అంటే ఇష్టం. అందుకే వారు నవలలోని పాత్రలను బట్టి, పాత్రలు మాట్లాడేటప్పుడు ప్రజల భాషయైనా మాండలికాన్ని వాడారు.