త్యాగ బుద్ది కలిగిన ఇద్దరు మహనీయుల వివరాలను లేదా కధ లను సేకరించండ
Answers
Answered by
3
Answer:
kya sofa bed in the new bunddel it
Answered by
9
త్యాగ బుద్ది కలిగిన ఇద్దరు మహనీయుల వివరాలు :
Explanation:
- దశరథుడు కైకేయికి ఇచ్చిన మాట ప్రకారం శ్రీరాముడు రాజ్యాన్ని త్యజించి పదునాలుగేండ్లు వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది. రాముడు, అత్తలు వారించినా వినకుండా సీత పట్టు బట్టి "నిన్ను విడచి నేనుండలేను.
- అడవులలో నీతో గడ్డిపై పడుకున్నా నాకు హంసతూలికా తల్పంతో సమానం. నేను నీకు ఇబ్బంది కలిగించను." అని వాదించి రామునితో వనవాస దీక్ష అనుభవించడానికి బయలుదేరింది. అన్నను, వదినను అంటిపెట్టుకుని సేవించడానికి లక్ష్మణుడు బయలుదేరాడు.
- అప్పుడు రామునకు 25 సంవత్సరములు, సీతకు 18 ఏళ్ళు, లక్ష్మణుడు 16 ఏండ్లవాడు. సీతారాములు చిత్రకూట పర్వతం, మందాకినీ నది అందాలను చూసి మురిసిపోతూ వనవాసం గడుపసాగారు.
- భరతుడు వచ్చి అన్నపాదుకలు తీసికొని వెళ్ళిన తరువాత సీతారామలక్ష్మణులు అత్రి మహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ సీత అనసూయను పూజించింది. అనసూయ సీతకు అనేక పాతివ్రత్య ధర్మాలను ఉపదేశించి, మహిమగల పూలదండ, చందనం, వస్త్రం, ఆభరణాలు బహూకరించింది.
- హిందూ సమాజంలో స్త్రీ ప్రవర్తనకు, ఆలోచనకు సీతా చరిత్ర మార్గదర్శకంగా నిలిచిపోయింది.సిత దెవి ఎంతో గొప్పగ జీవించింది.సమాజానికి ఒక మర్గదర్సిగా నిలిచింది.
- శ్రీరాముని ముఖ్య భక్తులలో ఒకడు.. భరతుడు. శ్రీరామునికి కూడా భరతునిపై ఎంతో ప్రేమ. అందుకే దశరథునిలాగా భరతుని ప్రేమతో లాలించేవాడు. అందుకే రాముడు వనవాసానికి వెళ్లినప్పుడు భరతుడు శోకసంద్రంలో మునిగిపోయాడు.
- అత్యంత సుకుమారమైన స్వభావం కలవాడు.. మెత్తని పాన్పులపై నిద్రిస్తూ, పన్నీటి స్నానాలతో రాజ్యభోగాలను అనుభవించేవాడు.. ఆ భోగాలకు దూరమై రామనామ స్మరణలో మునిగిపోయాడు. అన్న దూరమైనందుకు కుంగిపోయి.. నియమిత ఆహారాన్నే స్వీకరిస్తూ,
- నీకు దక్కని భోగానుభవం తనకూ అవసరం లేదని భావించే త్యాగధనుడు.
- ఇంతటి సాధుశీలియైున భరతుడు క్రూరస్వభావం కలిగిన కైకేయికి కుమారుడిగా ఎలా పుట్టాడో కదా?’’ అని వాపోయాడు. భరతుని చరితాన్ని, తన మనసును ఆకర్షించే స్వభావాన్ని లక్ష్మణుడు సవిస్తరంగా పలికింనందుకు శ్రీరాముడు సంతోషించాడు.
- శ్రీరామునిచే మహాత్ముడిగా సంబోధించబడిన భరతుని కీర్తి చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచేయుంటుంది. భరతుని స్వభావం, అన్నగారి పట్ల ప్రేమ, రాముడు దూరమైనప్పుడు గడిపిన త్యాగజీవనం.. అన్ని కాలాల వారికి ఆదర్శప్రాయంగా నిలిచేవే.
Similar questions