'మంచిపనికి అందరం సహకరించాలి సమర్థిస్తూ రాయండి.
Answers
Answer:
హలో! నేను కూడా తెలుగునే!
అవును, నువ్వు చెప్పింది కరెక్టే మంచి పనికి అందరం సహకరించాలి. ఎందుకంటే అది ఒక మంచి పని. ఉదాహరణకి ఈ రోడ్డు పక్కన ఒక తాత తన కర్ర పడిపోయి నడవలేక పడి ఉంటే, ఒక పాప అతన్ని చూసి అతని తల వాటర్ బాటిల్ లోని మంచినీళ్లు అని ఇస్తుంది. అప్పుడు ఎవరైనా పెద్ద వాళ్ళు వెళ్లి అంబులెన్సని పిలవడం, లేకపోతే కూర్చో పెట్టి అతని కుటుంబ సభ్యులకు తెలియజేయడం, లాంటివి చేసి సహకరించాలి. ఏదైనా ఒక మంచి పని చేయాలంటే అందరం కలిసి చేస్తే, చాలా త్వరగా పూర్తవుతుంది. అంతేకాకుండా భారం మొత్తం ఒక్కరి పైనే కాకుండా అందరూ సమానంగా పంచుకున్నట్టు అవుతుంది.
అంతేకాదు ఒక మంచి పనికి అందరూ పంచుకుని చేయాలి. అలా చేయడం వల్ల మనల్ని చూసి ఇంకొకరు కూడా మంచి పనులు చేయాలని అనుకుంటారు. అంతే కాదు మనకు చాలా గొప్ప పేరు వస్తుంది, అలాగే మంచి అనుభవం వస్తుంది, ఇంకా ఇంకా మంచి పనులు చేయాలని అనిపిస్తుంది. ఇంకొకరికి మంచి చేయడం వల్ల మనకి కూడా మంచి జరుగుతుంది. మనo ఎప్పుడు అందరికీ సహాయపడుతూ మంచి పనులు చేస్తూ ఉంటే, మనకు ఎప్పుడైనా సహాయం అవసరమైనప్పుడు వాళ్ళు మనకి సహకరిస్తారు.
చెప్పాలంటే ఇంకా చాలా లాభాలే ఉన్నాయి. మంచి పనులు చేయడం వల్ల. అవన్నీ ఎక్కడ రాస్తే సరిపోదు, ఆచరణలో పెట్టాలి.