India Languages, asked by rahuldandu11, 4 months ago

బలి చక్రవర్తి మాట మాట దిరుగలేని మానధనుడు అనే
విషయాన్ని పాఠ్యాంశం ఆధారంగా నిరూపించండి.​

Answers

Answered by vilazehra140
6

Answer:

please write in english or in hindi....

we are not tamila......

..sorry dear

Answered by gandiyatheswar
11

Answer:

బలి గొప్పరాక్షస చక్రవర్తి, యోద్ధ ఘనుడు, దానఘనుడు, మానఘనుడు. . . శ్రీమన్నారాయణుడు ఇతని గురించి వామనావతారం ఎత్తి, అథోలోక చక్రవర్తిగ జేసాడు. అజ్ఞానం తొలగించాడు అతనిని అణిచేయ లేదు, అంతటి గొప్పవాడు బలిదైత్యేంద్రుడు. నీ మూడోపాదం నా తలపై పెట్టు అన్నా, అలా చేసినట్లు మన పోతన్నగారు చెప్పలేదు, ప్రహ్లాదుని పౌత్రుడు బలి. మిక్కిలి బలశాలి. గొప్ప యుద్దకళానిపుణుడు, యుద్ధనీతిజ్ఞుడు. తన విశేష బలంతో ఇంద్రుని మీదకి వెళ్ళిన వాడు. ఇంద్రపదవికోసం వందయజ్ఞాలు చేయాలి అంటారు. అంటే బలాలతో సాధించేది కాదు సాధనతో సాధించేది స్వర్గలోకం అనుకోవచ్చు. ఇంద్రుడు ఇంద్రియాలకు మనసుకు అధిపతి మరి. స్వర్గ ప్రవేశానికి సామాన్యంగా పుణ్యబలం కావాలి. అక్కడి సౌఖ్యాలు అనుభవించంటం ద్వారా కూడబెట్టిన పుణ్యం వ్యయంకాగానే మళ్ళా మర్త్యలోకం రావాలి. ఇకపోతే, ప్రహ్లాదుడు అంటే విశేషమైన ఆనందం కలవాడు లేదా చిదానందుడు. అలా ఆత్మానందం అందుకో గలిగిన వానికి విశేషమైన శక్తిసామర్థ్యాలు అలవడతాయి. వీటిలో భౌతికమైన శక్తికి తగులం పడితే, ఎవరినైనా జయించ గల శక్తి పొందచ్చు. అహంకారం విజృంభిస్తుంది. అది రాక్షసగుణ ప్రధానానికి దారితీస్తుంది.

ఇప్పుడు మళ్ళా కథలోకి వెళ్దాం. ప్రహ్లాదుని పౌత్రుడు బలి. ఇంద్రునికి ఓడిన వాడు. శుక్రాచార్యుడు వీరి గురువు. వీరి అండతో విపరీతమైన సైనిక, దైహిక బలాలు వీర్యం పొందాడు. ఆ బలాల సాయంతో స్వర్గంమీదకి యుద్దానికి వెళ్లాడు. అక్కడ అధిపతి ఇంద్రుడు కదా ఆలోచనాపరుడు కదా. గురువు బృహస్పతిని చేరాడు. ఆయన విప్రబలమున వీనికి వృద్ధివచ్చె వారిఁ గైకొన కిటమీఁద వాఁడి చెడును; అని మంత్రోపదేశం చేసాడు. విప్రబలం అంటే దైవారాధన, యోగసాధ నాదులచే లభించే దైవబలం. దీనికి గురువులను ఆశ్రయించాల్సిన అవసరం ఉంది. దాంతో ఇంద్రుడు సపరివారంగా పక్కకి తప్పుకున్నాడు. బుద్ది పక్కకి తప్పుకుంది. త్రి లోకాధిపతి అయ్యాడు.

దానితో మహా సాధకుడే, మహాపుణ్యాత్ముడే, దానాది సుగుణాలలో సాటిలేని వాడే కాని, బుద్ధిచెప్తుండే గురువులు చెప్పేమాట పెడచెవిని పెట్టడం మొదలైంది. మరి ఈయన అతికాయుడు, అతికార్యుడు కదా. దానికి విరుగుడుకి సూచనగా బడుగు వడుగు వలె కన్పట్టు వామనుడై దిగి వచ్చాడు. ఒకామె కశ్యపుని భార్య అదితి (జీవాత్మ ధారి) పయోభక్షణ వ్రతం చేపట్టింది. పయస్ అంటే నారములు కదా వాటిని భక్షించటం అంటే జీర్ణచేసుకోడం. అలా జ్ఞానగ్రహణం ఫాల్గుణ మాసం శుక్లపక్షం పాడ్యమినుంచి పన్నెండురోజులు చేసింది. సంతోషించిన నారాయణుడు, విశ్వ వ్యాపకుడయ్యు పుత్రుడిగా విశ్వగర్భుడు ఆమె గర్భంలోకి దిగివచ్చాడు. సమయం ఆసన్నంకాగా దిగి వచ్చాడు కపట వటునిగా ఉపనయన వయస్కుడిగ వామనుడై.

అదే అంటారు కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని. రూపంలో వామనుడైన విష్ణుమూర్తి చిరుకోరికగానే అడిగాడు. నేను అతికాయుణ్ణి, అతికార్యుణ్ణి, నన్ను ఇంత స్వల్పకాయుడవు ఇంత స్వల్పం అడుగుతావా అంటున్నాడు అతివీరుడు. తెలియకా కాదు ఇద్దరికి తెలుసు.

Similar questions