భ,ర,న,భ,భ,ర,వ అనే గణాలు ఏ పద్యంలో ఉంటాయి.
Answers
Answer:
The elements bha, ra, na, bha, bha, ra, va are present in any verse.
Explanation:
Telugu
భ,ర,న,భ,భ,ర,వ అనే గణాలు ఏ పద్యంలో ఉంటాయి
1 ఉత్పలమాల
శ్రీ రమణీముఖాంబురుహ సేవన షట్పద నాధ యంచు శృం
గార రమేశ యంచు ధృత కౌస్తుభ యంచు భరేఫనంబులన్
భారలగంబులు గదియ బల్కుచు నుత్పల మాలికా కృతిన్
గారవ మొప్పఁ జెప్పుదురు కావ్యవిదు ల్యతి తొమ్మిదింటగన్.
గణ విభజన
UII UIU III UII UII UIU IU
భ ర న భ భ ర వ
శ్రీరమ ణీముఖాం బురుహ సేవన షట్పద నాధయం చుశృం
లక్షణములు
పాదాలు నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య
ప్రతిపాదంలోని గణాలు భ, ర, న, భ, భ ,ర, వ
యతి ప్రతిపాదంలోనూ
ప్రాస పాటించవలెను
ప్రాసయతి చెల్లదు
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య - 475
ఉదాహరణ 1:
భా9268ఉ.
పుణ్యుఁడు రామచంద్రుఁ డట పోయి ముదంబునఁ గాంచె దండకా
రణ్యముఁ దాపసో త్తమశరణ్యము నుద్దత బర్హి బర్హ లా
వణ్యము గౌతమీ విమల వాఃకణ పర్యటన ప్రభూత సా
ద్గుణ్యము నుల్లస త్తరు నికుంజ వరేణ్యము నగ్రగణ్యమున్.
ఉదాహరణ 2
భా867ఉ.
ఊహ గలంగి జీవనపు టోలమునం బడి పోరుచు న్మహా
మోహలతా నిబద్ధ పదము న్విడిపించుకొనంగ లేక సం
దేహముఁ బొందు దేహి క్రియ దీనదశ న్గజ ముండె భీషణ
గ్రాహ దురంత దంత పరిఘట్టిత పాదఖురాగ్ర శల్యమై.
#SPJ3