" కాలం చాలా విలువైనది " ఎందుకు ? వివరించండి
Answers
Answered by
41
Explanation:
సమాధానం:-
కాలం డబ్బు కన్నా విలువైనది. ధనం పోయినా తిరిగి సంపాదించవచ్చు. ఆస్తి పోతే మళ్ళీ సంపాదించవచ్చును. పరువు పోయినా, ప్రవర్తన మార్చుకొని , మంచి పనులు చేసి తిరిగి సంపాదించవచ్చును. కాని కాలం గడిచిపోతే తిరిగి సంపాదించలేం. గడిచిపోయిన ఒక్క సెకను కూడా తిరిగి రాదు.
బాల్యంలో సంపాదించవలసిన జ్ఞానం అప్పుడే సంపాదించాలి. చదువు, ఆటలు, పాటలు, ధనం, కీర్తి ఏదైనా సరే సకాలంలో సంపాదించాలి. కాలం గడిచిపోయాక బాధపడినా ప్రయోజనం లేదు. అందుకే కాలాన్ని వృధా చేయకూడదు. సక్రమంగా వినియోగించుకోవాలి.
Similar questions