అతి వేగం.. ప్రమాదకరం
Answers
Answered by
0
అవుకు: అతివేగం చాలా ప్రమాదకరమని సిఐటియు డివిజన్ నాయకులు సుధాకర్ సూచించారు. శుక్రవారం అవుకు పట్టణంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈనెల 16న అవుకు పట్టణానికి చెందిన డిగ్రీ విద్యార్థులు వెంకటరాజు, పెదరాయుడు, మధుతేజలు మోటార్‌సైకిల్‌పై వెళ్తూ ప్రమాదానికి గురై మృతి చెందారని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని యువకులతో కలిసి ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. యువకులు మోటారుసైకిళ్లపై అతివేగంగా వెళ్లరాదని, పరిమితికి మించి కూడా ప్రయాణించరాదని సూచించారు. అలా చేయడం వల్ల కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతాయన్నారు. చిన్నపొరపాటుకు పెద్దమూల్యం చెల్లించాల్సి వస్తుందని, విద్యార్థులు, యువకులు వీటిని గ్రహించి వేగంగా వెళ్లరాదని తెలిపారు. అనంతరం పట్టణంలో ఫ్లకార్డులు ప్రదర్శించి ర్యాలీ నిర్వహించారు. ఎస్‌సి స్కూల్ ప్రధానోపాధ్యాయులు శేఖర్‌నాయక్, పట్టణ యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Similar questions