జీవకారుణం అంటె ఎమిటి
Answers
Answer:
కాశీ రాజు బ్రహ్మపుత్రుడు పచ్చి మాంసాహారి. రోజూ జింక మాంసం లేనిదే ముద్ద ముట్టడు. సారనాథ్‌లోని జింకల వనం మీదపడి రోజూ భటులు జింకలను వేటాడి తెచ్చేవారు. ఆ జింకలకు ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు నిగ్రోధుడు. బంగారు వన్నె కలవాడు.
ఒకసారి జింకలన్నీ తమ రాజు నిగ్రోధుని దగ్గరకు వచ్చి..
‘రాజా! రాజభటులు రోజూ వేటాడటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. మనమే వంతుల ప్రకారం రోజుకు ఒక జింక చొప్పున రాజుగారి వంటశాలకు పోదాం’ అని విన్నవించాయి.
ఆ విషయం నిగ్రోధుడు కాశీ రాజుకు తెలియజెప్పాడు. అందకు కాశీ రాజు కూడా అంగీకరించాడు. ఒప్పందం ప్రకారం రోజుకు ఒక జింక చొప్పున వెళ్తూ ఉన్నాయి.
ఒక రోజున నెలలు నిండిన ఒక తల్లి జింక వంతు వచ్చింది. ఆమె నిగ్రోధుని వద్దకు వచ్చి తాను ప్రసవించాక వెళ్తానని, ఈలోపు తనకు బదులుగా మరో జింకను పంపమని వేడుకుంది. ఈ విన్నపాన్ని ఎవరూ అంగీకరించలేదు. చివరకు ఆమె స్థానంలో తానే వెళ్లాడు నిగ్రోధుడు.
స్వయానా జింకల రాజే వంటశాలకు రావడం తెలిసిన కాశీ రాజు హుటాహుటిన వచ్చి..
‘జింకల రాజా! మీరే ఎందుకొచ్చారు?’ అని అడిగాడు.
నిగ్రోధుడు విషయం చెప్పి ‘రాజా! రక్షించేవాడినే రాజు అంటారు. ఓ తల్లిని రక్షించడానికి వచ్చాను’ అన్నాడు.
ఆ మాటలు విన్న కాశీ రాజుకు మనసు చివుక్కుమంది. హృదయం బరువెక్కింది. వినయంగా నిగ్రోధుడికి నమస్కరిస్తూ..
‘జింకల రాజా! ఎంత చక్కని ధర్మం బోధించావు. రక్షించేవాడే రాజు అని చెప్పావు. కానీ, నేను నా రాజ్యంలో ఉన్న మిమ్మల్ని భక్షిస్తున్నాను. నాకు జ్ఞానోదయం అయింది. ఇదే నీకు మాట ఇస్తున్నాను. ఇకనుండి మీ జింకల వనం నుండి ఏ జింకా నాకు ఆహారంగా రానవసరం లేదు. మీ వనంలో వేట నిషేధిస్తున్నాను. మీ జింకలకు అభయం ఇస్తున్నాను. వెళ్లిరా’’ అని చెప్పాడు.
అయినా నిగ్రోధుడు కదలలేదు. రాజు వైపు తిరిగి ‘‘మహారాజా! మీ రాజ్యంలో మా జింకలకి అభయం లభించింది. మరి, మిగిలిన జంతువుల విషయం ఏమిటి?’’ అని అడిగాడు.
‘‘ఓహో! అలాగే! సమస్త జంతువులకీ అభయం ఇస్తున్నాను.’’
‘‘మంచిది రాజా! మరి ఆకాశంలో ఎగిరే పక్షులు, నీటిలో బ్రతికే జలచరాలు... అవీ ప్రాణులే గదా!’’
‘‘అలాగే నిగ్రోధా! వాటికీ అభయం ఇస్తున్నాను.’’
ఇకనుండి నా రాజ్యంలో ఏ జీవినీ వేటాడకూడదని ఆజ్ఞలు జారీ చేస్తున్నాను.’’ అన్నాడు.
నిగ్రోధుని త్యాగాన్ని, తన స్వార్థమే చూసుకోని అతని నిస్వార్థాన్ని, సమస్త జీవకోటిపట్ల చూపించిన అతని ప్రేమకు ముగ్ధుడయ్యాడు.
జీవకారుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలిచే ఈ కథ ‘నిగ్రోధ మృగజాతకం’గా బౌద్ధజాతక కథల్లో ప్రసిద్ధి.
Explanation:
i couldn't understand the language.......
.....