India Languages, asked by jyothika12, 9 months ago


“ఎవరి భాష వాళ్ళకి వినసొంపు" - ఎందుకు ?

Answers

Answered by Anonymous
33

Answer:

ఏ ప్రాంతం వాళ్ల తెలుగు ఆ ప్రాంతం వాళ్లకు ఇంకా మంచిగా ఉంటుంది.

పాతనీరుపోయి, కొత్తనీరు వస్తున్నట్లుగా భాష నిరంతరం మారుతూ ఉంటుంది. అది సహజలక్షణం. అదే సజీవ లక్షణం. అలాగే ప్రాంతాన్ని బట్టి భాష, యాస మారుతూ ఉంటుంది. ఇది క్రియారూపాల్లోనే కాక నామవాచకాల్లో, సంబోధనల్లో, మర్యాదల్లోనూ వైవిధ్యభరితంగా ఉంటుంది. ఒక ప్రాంతంలోని మనుషుల జీవన విధానం, వ్యవహార శైలి, పాలకుల విధానం, పరిసర భాష ప్రభావం, అక్కడ ఉత్పత్తులు, వనరుల వినియోగం తదితరాంశాలు భాష స్వరూప స్వభావాలను నిర్ణయిస్తాయి. (ఉదా॥సముద్రతీర ప్రాంతవాసులకు అక్కడ లభించే చేపలు, చేపలుపట్టే సాధనాలు, చేపలు వండటంలోని విధానాలు, సముద్రపు ఆటుపోటులు మొదలైన అనేక అంశాలు భాషలో భాగమైపోతాయి. అవి మిగతా వ్యవ మీద కూడా ప్రభావం చూపిస్తాయి. సముద్రాలకు దూరంగా కొండల్లో నివాసముండే వాళ్లకు అక్కడ దొరికే కాయలు, పండ్లు, నీటి ఎద్దడితో ఎదుర్కునే ఇబ్బందులు, వస్త్రధారణ, ఆహార వ్యవహారాలు వాళ్ల భాషలో అంతర్లీనమై నిత్యవ్యవహారంలోనూ భిన్నత్వాన్ని చూపిస్తాయి కదా!) అదే విధంగా ప్రతి పదిమైళ్లకు భాషలో భేదం ఉంటుంది. భాష పరమార్థం భావవినిమయమే కాబట్టి ఎక్కడి ప్రాంతం వాళ్లు అక్కడ మాట్లాడే భాషకు బాగా అలవాటు పడతారు. చెవులకింపుగా, హృదయాన్ని తాకేటట్లుగా ఉండే ఆ భాష వాళ్ల రక్తంలో రక్తమై విడదీయరాని గాఢానుబంధాన్ని ఏర్పరుస్తుంది. అందుకే భాష తల్లివంటిదని ‘మాతృభాష’ అని గౌరవిస్తూ ఆత్మీయానందాన్ని అనుభవిస్తుంటాం. ‘ఎవని కంపు వానికింపు’అన్నట్లు మనదైన భాష మనకు ఇంపూ, సొంపు. తద్భిన్నమైన అలవాటులో లేని భాష విన్నప్పుడు అసౌకర్యంగానే కాక విచిత్రంగా అనిపిస్తుంది. అది రుచించదు. (అలవాటైతే అది కూడా బాగుంటుంది) అందుకే ఎవరి భాష వాళ్లకు చాలా బాగ అనిపిస్తుంది.

2. ‘గురుస్థానీయులు’

అంటే ‘గురువు’ స్థానానికి తగినవారు. భారతీయ సంస్కృతిలో గురవుకు అత్యున్నత స్థానాన్ని ఇచ్చారు. దేవుని కంటె గురువే గొప్పవాడంటాడు కబీరుదాసు. ఎందుకంటే ఆ దేవుడి గురించి చెప్పినవాడు గురువే. మనలోని సృజనకు బీజాలు వేసి(బహ్మ), ఉత్తమ గుణాలను పోషించి (విష్ణువు), చెడును జయింపజేసి (శివుడు) జీవితాన్ని జ్ఞానభరితం చేయగల (పరబ్రహ్మ) స్వరూపం గురువు. అలాంటి జ్ఞానం, ప్రేరణ, మార్గదర్శనం ఇచ్చే ప్రతి ఒక్కరినీ గురువుతో సమానంగా భావించడం ఉత్తమ సంస్కారం. అలాంటి వాళ్లందరూ గురుస్థానీయులే.

3. గురువులలో ఆశించదగిన ప్రత్యేకతలు:-

గురువంటే సర్వశ్రేష్ఠుడు. శుచి-వర్ఛస్సు, వక్తృత్వం-ధృతి, స్మృతి, కృతి, నమ్రత, ఉత్సాహం, జిజ్ఞాస కలిగిన వాళ్లు ఉత్తమ గురువులుగా భాసించగలరంటారు పెద్దలు. అంటే బయట, మనస్సులో స్వచ్ఛంగా ఉండే వాళ్లు, మంచి జ్ఞానవంతులు, చక్కగా మాట్లాడంతో పాటు పట్టుదల, జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, వినయం, ఉత్సాహం, కొత్తవిషయాలు నేర్చుకోవాలనే ఉత్సాహంతో నిరంతరం కృషి చేసేవాళ్లు, వాళ్ల విధులను ఏలోపం లేకుండా నిర్వహిస్తేచాలు; పిల్లలంతా ప్రభావితులవుతారు. అంటే

ఎప్పుడూ స్వచ్ఛంగా కన్పిస్తుండాలి

ఏది అడిగినా చక్కగా అర్థమయ్యేటట్లు వివరించాలి.

ప్రేమతో, మంచిమాటలు మాట్లాడాలి.

పట్టుదలతో పని చేస్తూ విద్యార్థుల్లో ప్రేరణ నింపాలి.

మంచి జ్ఞాపకశక్తి కలిగి విషయాన్ని బోధించాలి, చర్చించాలి.

ఎప్పటికప్పుడు కొత్తదనం ఉట్టిపడే టట్టుగా బోధన చర్య నిర్వహించాలి.

ఎంత గొప్పస్థానంలో ఉన్నా అహంకారాన్ని ప్రదర్శించకుండా విద్యార్థులతో స్నేహంగా, పెద్దవాళ్లతో వినయంగా ఉండాలి.

ఎప్పుడూ ఉత్సాహంతో ఉండాలి.

కొత్త విషయాలను నేర్చుకునేందుకు తపించాలి. ఆ అలవాటు విద్యార్థుల్లో నిర్మాణం చేయాలి.

పాత విధానాన్ని సంస్కరించుకుంటూ నిత్యనూతనంగా తనను తాను తీర్చిదిద్దుకుంటూ, విద్యార్థుల్లో మంచి గుణాలు పెంపొందించేందుకు ప్రయత్నించాలి.---ఇలాంటి గుణాలుండే ఉపాధ్యాయులంటే మాకైతే ఎంతో ఇష్టం. అసలు అలాంటి వాళ్లను ఇష్టపడని వాళ్లుంటారా?!

4. పసందైన ప్రాంతీయ భాష:-

‘పసందు’అంటే బాగా ఇష్టం అని అర్థం. ఏప్రాంతం వాళ్లకు ఆప్రాంతంలో మాట్లాడే భాషబాగా నచ్చుతుంది. అలా నచ్చడంలో భాషకు మూలాలైన స్థానిక పదాలు, అన్యభాషా ప్రయోగాలు, పలుకుబడులు, నుడులు, సామెతలు, జాతీయాలు... ఇవన్నీ ఎక్కడి వాళ్లకక్కడ అప్రయత్నంగా తాము మాట్లాడేటప్పుడు భాషలో ప్రయోగించడం వల్ల అనిర్వచనీయమైన ఆనందాన్నిస్తాయి. అందుకే ప్రాంతీయ భాష ఆయా ప్రాంతాల వారికి పసందుగా ఉంటుంది.

5. మాటలో, రాతలో ప్రాంతీయత కనిపించడం:-

ఒకప్పుడు మాట్లాడే భాష-రాసే భాష వేర్వేరుగా ఉండేవి. చదవడం నేర్చిన వాళ్లందరికీ ఒకే భాష ఉండేది. మాట్లాడటంలో మాత్రం అనేక కారణాల చేత భిన్నమైన శైలులు ఉండేవి. ఒకే ప్రాంతంలో నివసించే వాళ్లైనా వంశం (కుటుంబం), వృత్తి, ఉద్యోగం, నివసించే పరిసరాలను బట్టి మాట్లాడే తీరు వేరుగా ఉండేది. ఇంటి భాష, బడి భాష వేర్వేరుగాఉండేవి. కాల క్రమంలో ఈ భేదాలు అంతరించి మాట్లాడే భాషనే రాయడంలోనూ వినియోగించడం పరిపాటిగా మారింది. దాంతో రచయితలు తమ రాతలో కూడా ప్రాంతీయ భాషను విరివిగా ఉపయోగించడం అలవాటు చేసుకున్నారు. మరికొంతమంది పట్టుబట్టి తమ ప్రాంతపు యాసలోనే మాట్లాడటం, రాయడం అలవాటు చేసుకున్నారు. ఆవిధంగా రాతలోను, మాటల్లోనూ కొందరి భాషలో ప్రాంతీయత స్పష్టంగా కనిపించేది. ఈ మాటలు సామలసదాశివ తన ‘యాది’ పుస్తకంలో మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించిన సురవరం ప్రతాపరెడ్డి అనే సుప్రసిద్ధ సాహితీవేత్త గురించి చెప్పేటప్పుడు పేర్కొన్నారు.

6. ఏకలవ్య శిష్యుడు:-

అంటే ఏకలవ్యుని వంటి శిష్యుడు. ద్రోణాచార్యుడు ప్రత్యక్షంగా విద్యనేర్పించకున్నా, అతనినే గురువుగా భావించి, ధనుర్విద్యలోని మెళకువలన్నీ నేర్చుకున్నాడు ఏకలవ్యుడు. అదే విధంగా తమకు అందుబాట్లో లేకున్నా కొందరి గొప్పలక్షణాల నుంచి ప్రేరణపొంది, ఆయారంగాల్లో కృషి చేసి పేరు సంపాదించుకునే వారు ఏకలవ్య శిష్యులు. సామల సదాశివ వేలూరి వారికి ఏకలవ్య శిష్యుడినని చెప్పుకున్నారు. (దోరవేటి దాశరథి ఏకలవ్య శిష్యుడినని అని చెప్పుకుంటాడు)


harshagibh44: super akka
Similar questions