మీకు నచ్చిన గొప్ప వ్యక్తి ఎవరి ద్వారా ప్రేరణ పొందారో తెలుసుకొని రాయండి మరియు ఆ వ్యక్తి ద్వారా నీవు ఏ విధంగా ప్రేరణ పొందినావో నివేదిక రాయండి
Answers
Explanation:
చిన్నచిన్న పదాలే పాటని పరుగు పెట్టిస్తాయి. తాళగతిని నిర్దేశించే పదాల కోసం రచయిత వెతుకుతూ ఉంటాడు. అందుకే పాటల కోసమనే కాదు విషయ అవగాహన, శబ్దపరిజ్ఞానం కోసమైనా రాయదలచుకునే వాళ్లు ఎక్కువగా చదవాలి’’ అంటారు భువనచంద్ర. ఉల్లిపొరలాంటి చిలిపి శృంగార గీతాలే కాదు, గమ్మత్తైన పదాల చమక్కులతో, హుషారెత్తించే పాటల సరాగాలతో మదిని ఆనంద డోలలూగించగలిగిన సత్తా ఆయన సొంతం. ఈ పాటల విలుకాడితో తెలుగువెలుగు ముఖాముఖి..
శేషపూర్ణానంద ప్రభాకర గురురాజైన మీరు భువనచంద్రగా ఎలా మారారు?
వూరకరణం శేషపూర్ణానంద ప్రభాకర పెద గురురాజు అనేది నా అసలుపేరు. సినిమాల్లోకొచ్చాక భువనచంద్ర అని మార్చుకున్నాను. ఇంటి దగ్గర రాజబాబు అనేవారు. వైమానిక దళంలో ఉన్నప్పుడు రాజు అని పిలిచేవారు. సినిమా పాటలు రాయకముందు అపరాధ పరిశోధక నవలలు కొన్ని రాశాను. రాజు అనేది ఆ నవలలకి సరిపోదనుకుని కొత్త పేరు ఏదైనా ఉంటే బాగుంటుందనుకున్నాను. మా అమ్మపేరు చంద్రావతి. నన్ను కొడుకులాగా ఆదరించిన తల్లి భువనేశ్వరి. వీళ్లిద్దరి పేర్లు కలుపుకుని భువనచంద్ర అని పెట్టుకున్నాను.
పాటల రచయితగా మీ ఎదుగుదలకు ప్రేరణ ఏంటి?
ఏడెనిమిదేళ్ల వయసులో నాకు గమ్మత్తయిన కోరిక ఒకటి ఉండేది. అప్పటి సినిమా పోస్టర్ల మీద కథ, మాటలు, పాటలు అని ఉంటుంది కదా! అక్కడ నా పేరు రాసుకుని, ఎప్పటికైనా అంతటి స్థాయికి ఎదగాలని అనుకునేవాణ్ని. ఆత్రేయ, ఆరుద్ర లాంటి రచయితల పక్కనే నా పేరు ఉంటే బాగుంటుందనుకునేవాణ్ని. నా మిత్రులు అది చూసి నువ్వేం అవ్వాలో అప్పుడే నిర్ణయించుకున్నావురా! అనేవారు. ఎస్సెస్సెల్సీ పూర్తయ్యేంత వరకూ ఈ అలవాటు ఇలాగే కొనసాగింది. నేను మొదటిసారి పాట రాసిన సినిమాకే ఆత్రేయ కూడా రాశారు. అలా ఆయన పేరు పక్కన నా పేరు ఉండటం చూసుకుని చాలా ఆనందించాను. ‘‘ఎవరో అతడెవరో ఒకరొస్తారు’’ అదీ ఆయన పాట. అందులో ఒకచోట ‘‘పిల్లకి పెళ్లిచూపులు/ పాఠం నేర్పని పరీక్షలు’’ అంటారాయన. ఎంత అందంగా చెప్పారో! పాఠం చెప్పకుండా పరీక్ష పెడితే వాళ్లేం రాస్తారు. పెళ్లిచూపులు కూడా అంతే కదా! ఆ మహానుభావుడి పేరుకింద నాపేరు ఉండటం అంటే గొడుగు నీడ కింద ఉండటమే కదా!
వైమానిక దళం నుంచి చిత్రసీమలోకి అడుగుపెట్టడానికి కారణమేంటి?
పద్దెనిమిదేళ్లు వైమానిక దళంలో పనిచేసి బయటకొచ్చిన తర్వాత ఓఎన్‌జీసీలో ఉద్యోగం వచ్చింది. అందులో చేరడానికి నెలరోజుల వ్యవధి ఉంది. అమ్మకి చెప్పి మద్రాసు వెళ్లాను. సినిమాలకి పాటలు రాయాలనే కోరికతో ప్రయత్నాలు ముమ్మరం చేశాను. విజయబాపినీడు వారి ‘పెళ్లాం కావాలి’ చిత్రానికి పాట రాసే అవకాశం వచ్చింది. ‘‘వినోదాల విందురా/ బాధలన్ని బందురా/ సినిమా సాటిలేదురా/ డ్యాన్స్ ఫైట్ మిక్స్‌రా/ మళ్లీ మళ్లీ చూడరా/ సినిమా.. సినిమా.. సినిమా..’’ ఇదీ నా తొలిపాట. సినిమా రంగంలోకి ప్రవేశిస్తూనే సినిమా నేపథ్యంగా పాట రాయడం నా అదృష్టం.