English, asked by RONAKKRISHNA, 5 months ago

. కులమున్ రాజ్యముఁ దేజమున్ నిలుపు మీ కుబుండు విశ్వంభరుం
డలఁతిం బోఁడు త్రివిక్రమస్ఫురణవాఁడై నిండు బ్రహ్మాండముం
గలఁడే మాన్ప నొకండు? నా పలుకు లాకర్ణింపు కర్ణంబులన్
వలదీ దానము గీనముం; బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా !​

Answers

Answered by ItzEnchantedGirl
8

దాతల్లో గొప్పవాడా! ఓ బలి చక్రవర్తి! మీ కులాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు. కొంచెం మాత్రమే తీసుకొని పోయే వాడు కాడు. మూడు అడుగులతో మూడు లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండి పోతాడు. ఎవరైనా అతడిని ఆపగలరా? నా మాట విను. దానం వద్దు దీనం వద్దు. ఈ బ్రహ్మచారిని (వామనుడిని) పంపించు.

అని ఈ విధంగా తన వంశ గురువైన శుక్రాచార్యుడు తన మేలు కోరి చెబుతుండగా క్షణకాలం కన్నులు మూసుకొని కీర్తిమంతుడు ఇట్లన్నాడు.

Similar questions