మాతృభాష- దాని ప్రాముఖ్యత అర్థం
Answers
మాతృభాష అనేది ఒక బిడ్డ పుట్టిన తరువాత వినడం ప్రారంభించే భాష, అందువల్ల ఇది మన భావోద్వేగాలకు మరియు ఆలోచనలకు ఖచ్చితమైన ఆకృతిని అందించడంలో సహాయపడుతుంది. విమర్శనాత్మక ఆలోచన, రెండవ భాష నేర్చుకునే నైపుణ్యాలు మరియు అక్షరాస్యత నైపుణ్యాలు వంటి ఇతర నైపుణ్యాలను పెంచడంలో మీ మాతృభాషలో నేర్చుకోవడం కూడా చాలా ముఖ్యమైనది.
HOPE IT HELPS U ......
HAVE A GOOD DAY ☺
Answer:
Explanation:
మాతృభాష ఏదైనా అది తల్లి తో సమానం. మనం తల్లిని ఎంత గౌరవము ఇస్తామో, మన మాతృభాసః ని కూడా అంతే గౌరవించాలి. అది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హింది కావచ్చు. ఎవరి భాష వారికి అది గొప్పది. మనం తెలుగు భాష తక్కువ అని అనుకో కూడదు. తెలుగు భాష కి చాలా చరిత్ర ఉంది. తెలుగు భాష సంస్కృతం నుండి ఆవిర్భవించింది. అందులో ఎందరో కవులు, రచయితలు గ్రంధ కర్తలు చాలా చాలా రచనలు చేశారు.
తెలుగు భాష గొప్పతనం తెలియాలంటే తెలుగులో సంభాషించాలి. గొప్పవాళ్లు రాసిన రచనలు పద్యాలు, గద్యాలు, గేయాలు, కథలు, కవితలు, పల్లెగీతాలు, కూనిరాగాలు, ఇంకా హాస్య రచనలు, విప్లవ రచనలు , విప్లవ గీతాలు చదవాలి. ఎన్నిటిలోనూ వారు చేసే భావ ప్రకటన, కొత్త కొత్త పదాలు, ప్రాసలు, సంగీతాలంకారాలు, జ్ఞానం, చరిత్ర తెలుస్తాయి.
మన పట్టణాలు, పల్లెలు, అక్కడ ఉండే ప్రజలు, విహారయోగ్యమైన ప్రదేశాలు, యాత్రికుల అనుభవాలు, కట్టడాలు, సెలయేర్లు, అడవులు, వన్య ప్రదేశాలు, గుడులు గోపురాలు, ఇంకా నదులు, పుణ్య క్షేత్రాలు, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి మన ప్రదేశాలలో. కానీ మనం అన్నీ చూడలేము. వాటినిగూర్చి మనం తెలుసుకొని ఇంకొకరికి ఆవిషయాలు చెప్పాలి. మన భాష గొప్పతనం ముందర మనం అర్ధం చేసుకొని తరువాత అది తెలియని వారికి చెప్పాలి.
మన భాషలో ఎన్నో గొప్ప భకృ గీతాలు, మహాభారతం, రామాయణం , భాగవతం, దశావతారాలు ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. మనం ఈకాలంలో ఇవేవీ చదవకుండా పాశ్చాత్య సంస్కృతి పైనే ఎక్కువ మక్కువ చూపడం న్యాయం కాదు పద్ధతి కాదు. అది మాతృ ద్రోహం చేయడమే.
భారత దేశం లో ఎన్నో భాషలు ఉన్నాయి. ఎవరి భాష వారు నేర్చుకొని అందులో ఉన్న తీపి ని ఆస్వాదించ గలిగితే, వారు తప్పకుండ మాతృభాషలకు అభిమానులౌతారు. ఈ కాలం లో పిల్లలు మాతృ భాషను కించపరచ రాదు. ఇంగ్లీషు హింది మరి ఇతర భాషలు నేర్చుకోవాలి. కానీ తెలుగు భాషని గౌరవించాలి.