CBSE BOARD X, asked by saimogili457, 5 months ago

అశం : తెలుగు
నగరగీతం పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి ?​

Answers

Answered by poojan
1

నగరగీతం పాఠ్యభాగ సారాంశం:

పల్లెటూరు కన్నతల్లి ఒడిలాంటిది. మనకు హాయిని ఇస్తుంది. పల్లెటూరి వాతావరణం అమోఘమైనది. ఎటుచూసినా ఆప్యాయంగా పలకరించే వారే! ఒకరితో ఒకరికి విడదీయలేని సంబంధం ఏర్పడుతుంది . ఒకరి కష్టసుఖాలను మరొకరు పంచుకుంటారు. ఎటువంటి కష్టాన్నైనా కలిసి ఎదుర్కుంటారు. సాయంత్రం కాగానే అందరును ఒకచోట కలిసి జరిగిన విషయాలను తలుచుకుంటూ , నవ్వుకుంటూఉ ఆనందంగా గడుపుతారు. పల్లెటూర్లలో కాలుష్యం ఉండదు. ఎటుచూసినా చెట్లు, పొలాలు. చల్లని గాలి మన సేదతీరుస్తుంది. మనసుకి ఉల్ల్లాసాన్ని ప్రశాంతతని ఇస్తుంది. ఊరంతా పచ్చదనంతో వెదజల్లుతూ కళకళలాడుతుంది.

ఇక నగరాల విషయాలికి వస్తే ఇక్కడ ఒకరిని పట్టించుకోవడానికి మరొకరికి తీరిక ఉండదు. ఎవరికీ వారే యమునా తీరే! అన్నట్లు ప్రవర్తిస్తారు. ఒకరికి ఏమైనా మనకు అనవసరం, మనం బాగుంటే చాలు అనే తీరుతో వ్యవహరిస్తారు. సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వరు. నిరన్తరో పనిలో నిమగ్నమయ్యేవారికి లోకపాట్లు గురించి పట్టించుకునే తీరెక్కడుంటుంది. వీలైతే వారాంతంలో కుటుంబంతో  గడుపుతారు లేకపోతే లేదు. ఇక్కడి గాలి కాలుష్యం. గాలితోపాటే మనుషుల మనసులు కూడా దురలవాట్లతో త్వరగా కాలుష్యమయ్యే ప్రదేశం ఇదే. ఫ్యాషన్ ఫ్యాషన్ అంటూ సంస్కృతిని పాడుచేసే తీరుకు నాంది పలికే చోటు ఇదే. ఇక్కడ ప్రశాంతతకు చోటు ఉండదు.

పల్లెటూర్లలో మంచి ఆదాయం రాకపోవచ్చు, కానీ మంచి జీవితమైతే దొరుకుంతుంది. దీనిని అర్థంచేసుకోక పట్నాలకు వెళ్లే నాధుడిని కాపాడువారెవరో?

Learn more:

Difference between village and city in telugu.

https://brainly.in/question/737713

ఉపమాలంకారం యొక్క లక్షణం వ్రాసి, రెండు ఉదాహరణలు వ్రాయుము

https://brainly.in/question/16599520

Similar questions