History, asked by gaddamvennelavennela, 6 months ago

రంగాచార్య గారి మొదటి నవల ఏమిటి​

Answers

Answered by mq136021
3

Answer:

I am telugu girl follow me

Answered by somavarapuneelima
1

Answer:

వట్టికోట ఆళ్వారుస్వామి నిజాం పాలనలో తెలంగాణా జనజీవితాన్ని ప్రతిబింబించే నవలలు రాయాలని ప్రారంభించి ప్రజల మనిషి, గంగు నవలలు రాసి మరణించారు. ఆయన ప్రారంభించి పూర్తిచేయని ప్రణాళికను రంగాచార్యులు స్వీకరించారు.[4][5] ఆ క్రమంలో ప్రజలలో విప్లవబీజాలు పడుతున్నకాలాన్ని స్వీకరించి చిల్లరదేవుళ్ళు రాశారు. నిజాంపాలనలో ప్రజలపై జరిగిన దౌర్జన్యం, వెట్టిచాకిరీ, ఆడబాప వంటి వ్యవస్థలు, జనంలో పెరుగుతున్న అసహనం, అప్పటి ఆంధ్రోద్యమం, మతమార్పిడులు, వాటిని వ్యతిరేకిస్తూ తిరిగి హిందూమతంలోకి తెస్తున్న ఆర్యసమాజ్ వంటివన్నీ చిల్లరదేవుళ్ళు నవలలో చిత్రీకరించారు.[6] విప్లవానికి నేపథ్యాన్ని చిత్రించేందుకు నవల పనికివచ్చింది. విప్లవబీజాలు ఎదిగి ప్రజాపోరాటానికి దారితీస్తున్న కాలాన్ని (1940 దశకం) స్వీకరించి తర్వాతి నవల మోదుగుపూలు రాశారు. ఈ నవలలో నిజాం రాజ్యంలో ఉండే జాగీర్దారు అధీనంలోని ప్రాంతాన్ని నేపథ్యంగా తీసుకున్నారు. పత్రిక చదవడం కూడా నిషేధమైన అనూహ్యమైన స్థితిగతుల్లో, ఊరికి వచ్చిన వ్యక్తి పత్రిక చదివించడమే కాక గ్రంథాలయం కూడా పెట్టించడం, అది తగలబడిపోతే అడవిలోని ఆటవికులను చేరదీసి విప్లవం రేకెత్తిస్తాడు. 1940ల్లో నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా నైజాం ప్రాంతంలో ఏర్పడిన సాయుధపోరాట కాలాన్ని నవల ప్రతిబింబిస్తుంది. తెలంగాణాలో సాయుధ పోరాటం అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు, సాంఘిక స్థితిగతుల నేపథ్యంలో జనపథం నవల రాశారు. 1948లో తెలంగాణా నిజాం పరిపాలన నుంచి విముక్తం కావడం మొదలుకొని, 1970ల్లో అంకురించిన వామపక్ష తీవ్రవాద ఉద్యమాలు (నక్సలైట్ పోరాటాలు) వరకూ నవల సాగుతుంది. తెలంగాణా జనజీవితంలో 1938నాటి స్థితిగతులు ప్రతిబింబిస్తూ చిల్లర దేవుళ్లు, 1942 నుంచి 1948 వరకూ సాగిన తెలంగాణా సాయుధ పోరాటాన్ని చిత్రిస్తూ మోదుగుపూలు, 1948 నుంచి 1968 వరకూ జరిగిన పరిస్థితులు చూపిస్తూ జనపథం రాశారు. మొత్తంగా అలా తెలంగాణా సాయుధ పోరాటపు ముందువెనుకలను నవలల్లో చిత్రించాలన్న తన ప్రణాళిక నెరవేర్చుకున్నారు

దాశరథి రంగాచార్యులు సికిందరాబాద్ పురపాలక కార్పొరేషన్ సంస్థలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశాకా ఆయనకు ప్రభుత్వం వెస్ట్ మారేడ్ పల్లిలో భూమి కేటాయిస్తే, ఇల్లుకట్టుకున్నారు. దగ్గరలో స్థిరపడ్డ పేదల ఇళ్ళు, స్థలాలు ఆక్రమించుకుని ఒక గూండా వారిని అన్యాయం చేస్తుంటే రంగాచార్యులు అతన్ని ఎదరించి నిలిచారు. మురికివాడల్లోని పేదల్లో కొందరిని ఆ గూండా కొనేయడంతో విఫలమైన ఆ ఉద్యమం ఫలితంగా మాయ జలతారు నవల వెలువడింది. బతికేందుకు నగరం చేరుకుని మురికివాడల్లో నివసించే పేదల జీవితాలు, వాటి చుట్టూ అల్లుకున్న ధనరాజకీయాలు మాయ జలతారు నవలలో వస్తువుగా స్వీకరించారుఅమృతంగమయ నవలలో ఓ గ్రామం పుట్టుక నుంచి క్రమంగా అభివృద్ధి చెందుతూ పోవడాన్ని చిత్రీకరించారు. విశిష్టమైన శైలిలో రాసిన ఈ నవలలో మహాత్మా గాంధీ ప్రవచించిన గ్రామస్వరాజ్యం అంశాన్ని ప్రధానంగా స్వీకరించారు. గాంధేయవాదంతో పాటుగా నవలలో ఆధ్యాత్మికత వంటివి కూడా చూపించారు. గ్రామాల్లోని జనజీవనంలో ఆధునికత ప్రవేశించడంతో జరిగిన మార్పులు కథలో ముఖ్యంగా స్వీకరించారు.[9] రానున్నది ఏది నిజం? నవలలో భారతదేశం భవిష్యత్తు గురించి కన్న కలలను అక్షరబద్దం చేశారు. ఆ నవల రెండు భాగాలుగా వెలువడ్డ జనపథం నవలకు కొనసాగింపు 1970ల్లో తెలంగాణా ప్రాథమిక విద్యావ్యవస్థలో వచ్చిన గుణాత్మకమైన పరిణామాల నేపథ్యంలో ఒక ఉపాధ్యాయుని జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని చిత్రీకరిస్తూ రంగాచార్య రాసిన నవల పావని

Similar questions