India Languages, asked by pragna2502, 7 months ago

త్యాగం చేయటంలో ఉన్న గొప్పతనాన్ని, అనుభూతిని వివరించండి.​

Answers

Answered by yesiamin6
4

Answer:

గుణాలన్నిటిలోకి త్యాగగుణం చాలా గొప్పది. సేవాభావం, నిస్వార మనస్తత్వం ఉన్న వాళ్లు త్యాగం చేయడానికి వెనుకంజ వేయరు. మహాత్మగాంధీ దేశ స్వాతంత్య్రానికి తన జీవితాన్ని త్యాగం చేశారు. భారతీయులకు సేవ చేయటానికి మదర్ థెరీసా, సిస్టర్ నివేదితా మొదలగు వారెందరో వారి జీవితాలను త్యాగం చేశారు. ఏ రంగంలోనైనా తనకు చేతనైనంత త్యాగం చేసినవారు అఖండకీర్తివంతులు అవుతుంటారు. త్యాగం, దానం అనేది భారతీయులకు పుట్టుకతో వచ్చిన లక్షణం. పూర్వకాలంలో అయతే వారికివలసినంత లేకపోయనా తమ దగ్గర ఉన్నదంతా ఇతరులకు ఇచ్చి వారు ఆనందపడుతుంటే దానం చేసిన వారు సంతోషించేవారనే కథలు ఎన్నో పురాణాల్లో కనిపిస్తాయ. రంతిదేవుడు, శిబిచక్రవర్తి, దధీచి లాంటి వారిజీవిత చరిత్రలనుపరిశీలిస్తే త్యాగగుణం యొక్క గొప్పతనం తెలుస్తుంది. శ్రీరాముడు కూడా తన తల్లి కోరికను నెరవేర్చడానికి త్యాగగుణానికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఇస్తే వచ్చే ఆనందం ముందు తీసుకొంటే వచ్చే ఆనందం తక్కువగా కనిపిస్తుంది.

భారతీయతలో దానం చేయడం అంటే త్యాగం చేయడమంటే అది మరొక జన్మకు దాచుకోవడం లాంటిదని చెప్తారు. ఈరోజు నీవు ఆవగింజంత దానం చేస్తే దేవుడు రేపు నీకు తాటికాయంత ఇస్తాడు అని అనడంలో అంతరార్థం ఇది.

భారతీయంలో ప్రతి పనిలోను ఎన్నో అంతరార్థాలుంటాయ వాటిని అర్థం చేసుకొంటూ జీవనయానాన్ని చేస్తూ అజరామరమైన కీర్తిని పొందవచ్చు.

భారతదేశం పుణ్యభూమి కర్మభూమి ఇక్కడ కేవలం మాట నేర్చిన మనుష్యులే కాదు జంతువులు సైతం త్యాగగుణానికే ప్రాధాన్యతను ఇస్తాయ. రామాయణంలో జటాయువు అందరికీ తెలిసిన విషయమే. ధర్మం కోసం రాముని కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టింది ఆ పక్షిరాజు.

వాల్మీకి రామాయణంలో లేకపోయన జనశ్రుతిలో ఉన్న కథనం ప్రకారం ఉడుతా కూడా తన శక్తి మేరకు త్యాగం చేయడంలో ముందుఉంటుంది. మనకు ధీరోదాత్తుడుగా, అమేయ బలసంపన్నుడుగా కనిపించే ఆంజనేయుడు పోత పోసిన త్యాగగుణుడే కదా.

మహాభారతంలో ఎన్నో ఒడిదొడుకులు అనుభవించిన కర్ణుడు సైతం త్యాగగుణానికే పెద్దపీట వేశాడు. అడవుల్లో తిరిగే టపుడు ధర్మరాజు నకులుడు సహదేవుడు ద్రౌపది కుంతి నడవడానికి శక్తి లేనివారు అవుతుంటే భీముడొక్కడే తన నలుగురి అన్నదమ్ములను ద్రౌపదిని తల్లిని సైతం ఎత్తుకుని తిరిగేవాడు.

అట్లాంటి భీముడిని బకాసురునికి ఆహారంగా పంపిస్తాను మీరు భయపడకండి అని బకాసురుని వల్ల బాధపడే కుటుంబానికి కుంతీదేవి బాస చేస్తుంది. భీముణ్ణి పిలిచి ఈ బలహీనులను బాధపెట్టే బకాసురుని దగ్గరకు నీవు ఈ కుటుంబంలోని వారికి బదులుగా వెళ్లు అని చెబుతుంది. అపుడు కుంతిదేవి లోని త్యాగగుణం బయటపడుతుంది. భీముడు కూడా పరులకోసం నేనెందుకు వెళ్లాలి అనుకోకుండా తాము అనుభవిస్తున్న కషాన్నీ లెక్కచేయకుండా బకాసురునికి ఆహారంగా వెళ్తాడు. అక్కడ ఆ బకాసురుణ్ణి భీముడే మట్టు పెట్టడమనేది వేరు విషయం అయనా దాని వల్ల కూడా ఆ రాక్షసుని వల్ల బాధపడే ఆ గ్రామానికి మేలు చేసినట్టే అవుతుంది. ఇలా తమ వల్ల ఇతరులు ఆనందిస్తున్నారంటే వారికి తమ జీవితాన్ని కూడా ఆనందంగా ధారపోసేవాళ్లే నిజమైన దానవీరులు.

తన వారికే కాదు పరులకు కూడా శక్తిమేర సహాయపడాలన్నదే భారతీయనాడి. అసలు ప్రకృతినే త్యాగాన్ని, దానగుణాన్ని కలిగిఉంది. గాలి, నీరు వేడి ఇలా ఏవైనా ప్రకృతి ప్రతిఫలాపేక్ష లేకుండానే సర్వ ప్రాణికోటికి ఇస్తుంది. కనుక ప్రకృతిని చూచి ప్రకృతి పాఠాన్ని అర్థం చేసుకొని జీవనపథాన్ని నడిపిస్తే చాలు మహాత్ములుగా కీర్తిపొందవచ్చు. . మనిషికి మనిషి సహాయం చేయటమే మానవసేవ. ప్రతి మనిషి త్యాగబుద్ధితో ఎదుటి మనిషికి తోడుంటే మానవాళి అంతా సుఖశాంతులతో వర్థిల్లుతుంది. మనిషిగా జీవించడంలోని ఔచిత్యం తెలుసుకొంటే త్యాగగుణం యొక్క గొప్పతనం దానికదే తెలుస్తుంది.

Explanation:

ఇది మీకు సహాయం చేస్తుందని ఆశిస్తున్నాను. మరిన్ని సమాధానాల కోసం అనుసరించండి.

MARK AS BRAINLIEST

Similar questions