వ్యక్తిగత శుభ్రత పై ఒక పేరా రాయండి.
Answers
వ్యక్తిగత శుభ్రత:
ఆరోగ్యం మరియు వ్యక్తిగత పరిశుభ్రత అనేది ఎల్లప్పుడూ మనచేతిలో ఉంటుంది. ఒకవేళ మీరు సరైన పరిశుభ్రతను పాటించని పక్షంలో మీరు మరింత తరచుగా జబ్బుపడే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం అనేది అవసరం మాత్రమే కాదు, అయితే సంపూర్ణ స్వస్థతకు మూలాధారం కూడా.
_______________________________
♡Thanks♡
వ్యక్తిగత పరిశుభ్రత
సురక్షితమైన ఆహారానికి కీలకమైన ఐదు సూచనలు వీక్షించేందుకు క్రింద చిత్రం పైన క్లిక్ చేయండి
మనం తినే భోజనం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకునే తీరు, వ్యాయామం, సురక్షితమైన లైంగిక సంబంధము శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో ముఖ్య పాత్ర వహిస్తాయి. మన గ్రామాలలో వచ్చే వ్యాధుల్లో శరీర పరిశుభ్రత లోపించడం వల్ల వచ్చే వ్యాధులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. తలలో పేలు, గజ్జి, పుండ్లు, పిప్పిపళ్ళు, నీళ్ల విరేచనాలు, బంక విరేచనాలు ఇలాంటి జబ్బులన్నీ శరీర పరిశుభ్రత లేకపోవటము వలన వస్తాయి. శుభ్రత పాటించటం వలన వీటన్నిటినీ నివారించవచ్చును.
తల శుభ్రత
స్నానం చేయకుండా ఉంటే మురికి, చమట, నూనె వలన తలలో గడ్డలు పుండ్లు ఏర్పడతాయి.
తలపైవున్న చర్మంలో చెమటలాంటి జిగట పదార్థం మురికిని వదిలించడానికి కనీసము వారానికి ఒకసారి తలస్నానం చేయాలి.
కండ్లు, చెవి, ముక్కు శుభ్రత
శుభ్రమైన నీటితో ప్రతి రోజు కళ్ళను కడుక్కోవాలి.
చెవి,ముక్కులో తయారయ్యే ద్రవాలు పొక్కులుగా మారి నిల్వ ఉంటాయి. కాబట్టి వారానికొక రోజు చెవిలో గుబిలి తీసేయాలి. నీరు, నూనె పోయకూడదు.
పిల్లలకు జలుబు చేసినప్పుడు శ్రద్ధగా ముక్కులను మెత్తటి నూలు బట్టతో శుభ్రపరచాలి లేకపోతే వారికి గాలి పీల్చటము కష్టమవుతుంది.
నోటి శుభ్రత
దంతాలకు బొగ్గుపొడి, ఉప్పుపొడి, గరకుపండ్లపొడి వాడితే పింగాణిపొర అరిగిపోయి పన్ను పుచ్చుతుంది. పండ్ల పొడి, టూత్ పేస్టుతో పళ్ళు తోముకోవాలి.
ప్రొద్దున నిద్రలేచిన తరువాత రాత్రి నిద్ర పోయేముందు, ఏదైనా తిన్నప్పుడల్లా నోటిని పుక్కిలించాలి. లేదంటే పండ్ల మధ్యలో ఇరుకున్న ఆహార పదార్థాలు పులిసి నోటి దుర్వాసనను చిగుర్లకు హాని కలిగిస్తాయి. నోటి దుర్వాసన వలన పళ్ళు కూడా తొందరగా పుచ్చుతాయి.
చాక్లెట్లు, స్వీట్లు, ఐస్ క్రీములు, కేక్స్ వంటి పదార్థాలు తక్కువగా తింటే పుచ్చి పళ్ళు రావు
రోజూ మంచి పోషక ఆహారం తీసుకోవాలి.
పుచ్చిపోయిన పళ్ళు ఉంటే వెంటనే దంత వైద్యుల దగ్గరికి వెళ్ళి సరైన చికిత్స తీసుకోవాలి.
పళ్ళు తీయటము వలన కళ్ళకి ఎలాంటి ప్రమాదము ఉండదు.
సరిగా పళ్ళని శుభ్రం చేసుకోకపోవడం వలన పళ్ళ మీద పొరలాగా ఏర్పడి చిగుర్లకు హాని కలిగించి, దుర్వాసనని కలిగిస్తాయి. దీని కోసం దంత వైద్యులను సంప్రదిస్తే పళ్ళని వారే శుభ్రపరచుతారు. ఇలా చేసుకోకపోతే పళ్ళు ఊడిపోయే ప్రమాదము ఉన్నది.
Hope it will help you