Social Sciences, asked by sandeepguptha12l, 1 month ago

వ్యాసప్రక్రియను వివరించండి​

Answers

Answered by rishiramanuja
1

Answer:

ఆంగ్లంలో వచ్చిన వ్యాసాల ఆధారంగా తెలుగు రచయితలు కూడా వ్యాసాలను రాశారు. ఇందులో సాక్షి వ్యాసాలు, వదరుబోతు వ్యాసాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. వ్యాస రచన జ్ఞానానికి, సృజనశక్తికి, తార్కికతకు అద్దం పడుతుంది.ఇతర మాధ్యమాలలో కార్యక్రమాల రూపకల్పనకు కూడా మూలం వ్యాసం రచన మెళకువలు ఉపయోగపడ్తాయి.వ్యాసం అనేది ఫ్రెంచ్ భాషలో పుట్టింది.మాంటేన్ అనేవ్యక్తి ఫ్రెంచ్ భాషలో వ్యాసం ప్రారంభించాడు.ఆంగ్లంలో వ్యాసాన్ని ప్రారంభించిన వ్యక్తి ప్రాన్శిస్ బేకన్. తెలుగులో వ్యాసరచనను ప్రారంభించిన వ్యక్తి స్వామినేని ముద్దు నర్సింహంనాయుడు. తెలుగు లో వ్యాసరచనను ప్రారంభించిన సంవత్సరం 1842. హితవాది పత్రికలో వ్యాసాన్ని ప్రారంభించారు. స్వామినేని వారు వ్యాసానికి పెట్టిన పేరు ప్రమేయం.ఈ ప్రమేయం సంకలనమే హితసూచిని'.ఆధునిక ప్రక్రియలలో తొలుత ఆవిర్భవించిన ప్రక్రియ వ్యాసం.

ఉపన్యాసము,సంగ్రహము,ప్రమేయము అనే పేర్లు అనంతరం 20వ శతాబ్దంలో వ్యాసం అనే పేరు స్థిరపడింది.వ్యాసాలు అధికంగా రచించినది కందుకూరు వీరేశలింగంపంతులు.తొలితెలుగు వ్యాసరచియిత్రి పోతం జానకమ్మ.1880లో ఆంధ్రభాష సంజీవని పత్రికలో రాసారు.మొట్టమొదటి సారిగా వైజ్ఞానిక వ్యాసాలు రచించినవారు ఆచంటవేంకటరాయ సాంఖ్యాయనమ్మ.

Explanation:

Similar questions