రంగాచార్య గురించి పాఠ్యంశం ద్వారా తెలుగు
కున్నాక మీ ఆలోచనలపై ఆయన ప్రభావాన్ని
వివరిస్తూ ఒక వ్యాసం చేయండి?
Answers
జీవనయానం ప్రముఖ రచయిత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు డా.దాశరథి రంగాచార్యుల ఆత్మకథ. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని, పలు రాజకీయ, సాంఘిక పరిణామాలకు సాక్షీభూతినిగా నిలిచిన రంగాచార్యుల జీవితకథలో ఆయా పరిణామాలన్నీ చిత్రీకరించారు.
.దాశరథి రంగాచార్యులు మహాభారత రచన చేస్తున్న 1994లో ఆ సందర్భంగా ఖమ్మంలో సాహితీహారతి సంస్థ ఆధ్వర్యంలో రంగాచార్య దంపతులకు ఘనసత్కారం జరిగింది. ఆ వేదికపై పత్రికా సంపాదకులు, సాహితీవేత్త ఎ.బి.కె.ప్రసాద్ మాట్లాడుతూ "ఆంధ్రదేశపు రాజకీయ, సాంఘిక, సామాజిక చరిత్ర వ్రాయడానికి ఉపకరించే తెలుగు నవలలు పది ఉన్నాయంటే వానిలో అయిదు దాశరథి రంగాచార్యులవి అవుతాయి. దాశరథి ఆత్మకథ రాయకపోవడం ఆంధ్రదేశానికి ద్రోహం చేయడం అవుతుంది. వారు ఈ సభకు ఆత్మకథ వ్రాస్తానని వాగ్దానం చేయాలి." అని ఈ రచనకు బీజం వేశారు. ఆపై దాశరథి రంగాచార్యులు జీవనయానం 4-3-1994న ప్రారంభించి 12-1-1995న పూర్తిచేశారు. 21-7-1996న జీవనయానం వార్త ఆదివారం సంచికల్లో ధారావాహికగా ప్రారంభమై 2-8-1998న ముగిసింది. 103 వారాల పాటు జీవనయానం ధారావాహిక కొనసాగింది. అనంతరం పుస్తకంగా వెలువడింది.[1]